Telugu News Sports News Avani Lekhara wins gold in Para Shooting World Cup 2022, secures berth at 2024 Paris Paralympics PM Modi congratulates her
Avani Lekhara: మళ్లీ అదరగొట్టిన అవని.. పారా షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం.. ప్రధాని మోడీతో సహా పలువురి ప్రశంసలు..
Para Shooting World Cup 2022: టోక్యో పారాలింపిక్ ఛాంపియన్ అవనీ లేఖరా (Avani Lekhara) మరోసారి అదరగొట్టింది. ఫ్రాన్స్‌లోని చటౌరోక్స్‌లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ 2022లో R2- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో..
Para Shooting World Cup 2022: టోక్యో పారాలింపిక్ ఛాంపియన్ అవనీ లేఖరా (Avani Lekhara) మరోసారి అదరగొట్టింది. ఫ్రాన్స్‌లోని చటౌరోక్స్‌లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ 2022లో R2- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ పారాలింపిక్ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో 2024లో పారిస్ వేదికగా జరిగే పారాలింపిక్స్‌లో తన బెర్తును ఖరారు చేసుకుందీ పారా షూటర్. 20 ఏళ్ల అవని 250.6 రికార్డు స్కోరుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈక్రమంలో తన పేరిటే ఉన్న 249.6 స్కోరును బద్దలుకొట్టింది. కాగా ఈ ఈవెంట్‌లో పోలాండ్‌కు చెందిన ఎమిలియా బాబ్స్కా మొత్తం 247.6 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, స్వీడన్‌కు చెందిన అన్నా నార్మన్ 225.6 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నారు.
Congratulations @AvaniLekhara for this historic accomplishment. May you keep scaling newer heights of success and inspiring others. My best wishes. https://t.co/V5jb5AMzlV
కాగా గతేడాది ఆగస్టులో జరిగిన టోక్యో 2020 పారాలింపిక్స్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (SH1) ఈవెంట్‌లో కూడా బంగారు పతకం గెల్చుకుంది అవని. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో ఇండియా తరఫున తొలి స్వర్ణం గెలిచిన మొదటి మహిళగా అరుదైన ఘనతను అందుకుంది. తాజాగా మరో చారిత్రాత్మక విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఈనేపథ్యంలో ఈ ట్యాలెంటెడ్ షూటర్‌పై ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.’చారిత్రాత్మక విజయ సాధించిన అవనిలేఖరకు అభినందనలు. ఆటలో మీరు మరికొన్ని శిఖరాలను అధిరోహించాలి. మీ విజయాలతో ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి’ అంటూ ట్విట్టర్ వేదికగా అవనిని ప్రశంసించారు మోడీ. అదేవిధంగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ పారా షూటర్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Many congratulations to Avani Lekhara who won the gold medal at the Para Shooting World Cup with a spectacular world record of 250.6 in the women’s 10m air rifle event.
Keep up the fantastic work! pic.twitter.com/Qdi4wTTyKD