AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఓటీటీలోనూ అదరగొడుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌.. నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల్లో వరుసగా రెండు వారాల పాటు..

RRR Movie: బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా నటించారు.

RRR Movie: ఓటీటీలోనూ అదరగొడుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌.. నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల్లో వరుసగా రెండు వారాల పాటు..
Rrr
Basha Shek
|

Updated on: Jun 08, 2022 | 3:32 PM

Share

RRR Movie: బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా నటించారు. బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలివియో మోరీస్‌ హీరోయిన్లుగా మెప్పించారు. వీరితో పాటు శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల న‌ట‌న‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం ప‌ట్టారు. రాజ‌మౌళి టేకింగ్, విజ‌న్‌కు అందరూ ముగ్దులై పోయారు. ఇది కలెక్షన్ల రూపంలోనూ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000 కోట్ల మార్కును ట‌చ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజ‌మౌళి రికార్డు సృష్టించాడు. ఇలా బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ డిజిటల్‌ స్ర్కీన్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం మే 20నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండ‌గా.. హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో వ‌రుస‌గా రెండు వారాల పాటు అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మొద‌టివారం18 మిలియ‌న్ అవ‌ర్స్ కు పైగా వీక్షించ‌గా.. రెండ‌వ వారం 13.9 మిలియ‌న్ల అవ‌ర్స్‌కు పైగా వీక్షించిన‌ట్లు అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌. మొత్తం మీద15 రోజుల్లో 39.48 మిలియన్ల అవర్స్‌కు పైగా వీక్షించినట్లు ఇందులో పేర్కొంది. కాగా ఈ చిత్రంలో తార‌క్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో న‌టించాడు. డీవీవీ దాన‌య్య నిర్మించిన‌ ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూర్చారు.

Also Read:

Mithali Raj Retirement: మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం..అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన లేడీ మాస్టర్‌ బ్లాస్టర్‌..

Fire Accident: మెట్రో పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన వందలాది వాహనాలు

YS Sharmila: జగనన్నకు పోటీగా ట్రాక్టర్ నడిపిన షర్మిలక్క.. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగిందిలా..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!