T20 World Cup 2021: షూస్‌లో బీర్లు తాగుతూ.. షాంపెయిన్ బాటిల్స్ పొంగిస్తూ.. ఆసీస్ క్రికెటర్ల సంబరాలు మాములుగా లేవుగా..
ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీ 20 ప్రపంచకప్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. దుబాయి వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి మొదటిసారి..
ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీ 20 ప్రపంచకప్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. దుబాయి వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి మొదటిసారి పొట్టి ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందుకు తగ్గట్లే ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాభవం చవిచూసింది. అయితే ఆ తర్వాతే ఛాంపియన్‌లా ఆడింది. వరుస విజయాలు సొంతం చేసుకుంది. ఇక నాకౌట్ దశలో ప్రపంచకప్ ఫేవరెట్ పాక్‌ను మట్టికరిపించింది. అదే ఉత్సాహంతో ఫైనల్‌లో కివీస్‌పై అలవోకగా విజయం సాధించింది. దీంతో టీ 20 ప్రపంచకప్ మొదలైన 14 ఏళ్ల తర్వాత విశ్వవిజేతగా ఆవిర్భవించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ల సంబరాలు అంబరాన్నంటాయి.
వరల్డ్ కప్ ట్రోఫీని అందుకునే సమయంలోనే డేవిడ్ వార్నర్ షాంపెయిన్ పొంగించాడు. తోటి క్రికెటర్లపై చల్లుతూ హంగామా చేశాడు. ఇక ప్రజేంటేషన్ కార్యక్రమం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు మరింత సందడి చేశారు. షాంపెయిన్ బాటిల్స్ పొంగించారు. బీర్లు తాగుతూ సరదాగా డ్యాన్సులు వేశారు. అయితే సంబరాల్లో భాగంగా మాథ్యు వేడ్ ఏకంగా తన షూస్‌లో బీరు పోసుకుని తాగాడు. ఆ తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా షూస్‌లో బీరు పోసుకుని తాగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ‘ఇదెక్కడి సెలబ్రేషన్స్ రా బాబు..?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
How’s your Monday going? ?#T20WorldCup pic.twitter.com/7AyODVF4HM
— T20 World Cup (@T20WorldCup) November 15, 2021
View this post on Instagram
Also Read:
T20 World Cup 2021 Final: మూడో స్థానంలో వచ్చాడు.. జట్టును గెలిపించాడు..
2021 T20 World Cup Final: ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. రికార్డులు బ్రేక్ చేసిన కివీస్ కెప్టెన్