T20 World Cup 2021 Final: మూడో స్థానంలో వచ్చాడు.. జట్టును గెలిపించాడు..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలవడంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆసీస్ కప్ ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు...
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలవడంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆసీస్ కప్ ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ టోర్నమెంట్‌లో నెంబర్ 3కి ప్రమోట్ అయిన మార్ష్, డేవిడ్ వార్నర్ (53)తో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించి, ఆటను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాడు. ఈ 30 ఏళ్ల ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
“చాలా మంది ప్రజలు ఇలా అంటారు, కానీ నాకు ప్రస్తుతం మాటలు లేవు. ఈ బృందంతో అద్భుతమైన ఆరు వారాలు. ” కోచింగ్ సిబ్బంది నా వద్దకు వచ్చి మీరు ఈ టోర్నమెంట్ కోసం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని చెప్పారు. నేను అవకాశాన్ని పొందాను. (మొదటి బంతి సిక్స్) గురించి ఆలోచించడం లేదు. అక్కడకు వెళ్లి ఉనికిని కలిగి ఉండాలనుకుంటున్నాను. బిగ్ మార్కస్ స్టోయినిస్ ఎల్లప్పుడూ ఉనికిని కలిగి ఉండటం గురించి మాట్లాడుతుంటాడు. నేను ఉనికిని కలిగి ఉండాలని, పోటీలో ఉండాలని, అక్కడకు వెళ్లి నా ఆట ఆడాలని కోరుకున్నాను. ఇది నమ్మశక్యం లేదని.” మార్ష్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ముందుకు సాగడానికి చాలా కష్టపడింది. విలియమ్సన్ ఆటతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. విలియమ్సన్ 21 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను హాజిల్‌వుడ్ విడిచి పెట్టాడు. దీంతో విలియమ్సన్ మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. హాజిల్‌వుడ్ ఆస్ట్రేలియా తరఫున బంతితో అదరగొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం16 పరుగులే ఇచ్చాడు.
అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో ఓవర్లోనే ఫించ్ వికెట్ కోల్పోయింది. కానీ తర్వతా బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ మార్ష్ దాటిగా ఆడాడు. వార్నర్ కూడా వేగం పెంచాడు. ఈ క్రమంలో వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మాక్సీ కూడా 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
Read Also.. NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..