T20 World Cup 2021 Final: మొన్న హసన్ అలీ.. నిన్న హేజిల్‏వుడ్.. ఏం చేశారంటే..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2021 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది క్యాచ్‎గా వెళ్లింది. బౌండరీ వద్ద జోష్ హేజిల్‌వుడ్ క్యాచ్ విడిచి పెట్టాడు....

T20 World Cup 2021 Final: మొన్న హసన్ అలీ.. నిన్న హేజిల్‏వుడ్.. ఏం చేశారంటే..
Hazlewood
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 15, 2021 | 9:48 AM

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2021 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది క్యాచ్‎గా వెళ్లింది. బౌండరీ వద్ద జోష్ హేజిల్‌వుడ్ క్యాచ్ విడిచి పెట్టాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేశాడు. మొన్న జరిగిన రెండో సెమీఫైనల్‎లో పాక్ ఆటగాడు అఫ్రిది బౌలింగ్‎లో మాథ్యూ వేడ్ కాచ్య్ ఇచ్చాడు. కాని దాన్ని హసన్ అలీ మిస్ చేశాడు. దీంతో చెలరేగి ఆడిన వేడ్ ఆస్ట్రేలియాను గెలిపించాడు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో కవీస్ గెలిచి ఉంటే హసన్ అలీ ఎదుర్కొన్న విమర్శలే హేజిల్‎వుడ్ ఎదుర్కొనేవాడు. కానీ హేజిల్‎వుడ్ ఈ మ్యాచ్‎లో బాగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లకు 16 పరుగులే ఇచ్చాడు.

ఫైనల్లో డారిల్ మిచెల్‌ను ఔటం చేయడంతో ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం లభించింది. కానీ విలియమ్సన్ క్యాచ్‎ను హేజిల్‌వుడ్ విడిచి పెట్టడంతో కథ మారిపోయింది. అంతకుముందు కివీస్ 10.3 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. కానీ విలియమ్సన్ టచ్‎లో రావటంతో న్యూజిలాండ్ స్కోరు బోర్డు పరుగురులు పెట్టింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ పిచ్ కాస్త పొడిగా ఉందని, దానిపై గడ్డి కప్పలేదని వివరించాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అతను అంచనా వేశాడు.

ఫైనల్ మ్యాచ్‎లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా కప్ ఎగురేసుకుపోయింది. వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Read Also.. T20 World Cup 2021 Final: మూడో స్థానంలో వచ్చాడు.. జట్టును గెలిపించాడు..