AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మ్యాచ్‌ మధ్యలోనే మ్యాచ్‌ సెట్‌ చేసుకుంది.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్‌ చేసిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి..

ఇటీవల బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఓ జంట లవ్ ప్రపోజల్ అందరినీ ఆకర్షించింది.

Viral Video: మ్యాచ్‌ మధ్యలోనే మ్యాచ్‌ సెట్‌ చేసుకుంది.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్‌ చేసిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి..
Basha Shek
|

Updated on: Dec 12, 2021 | 8:15 PM

Share

ఇటీవల బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఓ జంట లవ్ ప్రపోజల్ అందరినీ ఆకర్షించింది. మైదానంలో ఆసీస్‌, ఇంగ్లండ్‌ దేశాల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతుంటే ఇరు దేశాలకు చెందిన యువతీయువకులు స్టాండ్స్ లోనే ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రేమకు లింగభేదం లేదంటూ ఒక మహిళ మరో మహిళకు వినూత్నంగా ప్రపోజ్‌ చేసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా జరిగిన ఓ సాఫ్ట్‌బాల్‌ టోర్నీ ఈ వెరైటీ లవ్‌ ప్రపోజల్‌కు వేదికగా మారింది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే గాయపడినట్లు నటించిన ఓ క్రీడాకారిణి ప్రియురాలి ముందు పెళ్లి ప్రపోజల్‌ ఉంచింది. మైదానంలో అందరూ చూస్తుండగానే పిచ్‌పైనే తనను పెళ్లి కోవాలని కోరి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలోవైరలవుతోంది.

ప్రొఫెషనల్‌ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులైన రియో, జసింతా కమాండే రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాగా పెర్త్‌లో జరిగిన తాజా మ్యాచ్‌లో సారా మధ్యలో గాయపడినట్లు నేలపై పడిపోతుంది. దీంతో స్టాండ్స్‌లో ఈ మ్యాచ్‌ చూస్తున్న జసింతా మైదానంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటివరకు బాధతో విలవిల్లాడినట్లు నటించిన సారా.. జసింతా రావడంతోనే మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్‌ చేస్తుంది. అనుకోకుండా జరిగిన పరిణామంతో జసింతా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న జసింతా ప్రేయసి సారాను ప్రేమగా హత్తుకుంటుంది. వీరి ప్రేమను చూసి మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా ఈ మ్యాచ్‌కు సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించింది. అంటే ముందుగానే తన పెళ్లి ప్రపోజల్‌కు ప్రణాళికలు ఏర్పాటుచేసుకుంది.

Also Read:

Chimpanzees: కార్‌ని మనుషులకంటే జాగ్రత్తగా శుభ్రం చేస్తున్న చింపాజీలు.. వీడియో నెట్టింట్లో వైరల్..

Viral Video: కుమార్తెలకు టీ తయారు చేయడం నేర్పించిన యుఎస్ న్యూరో సర్జన్.. అది చాయ్ కాదు బాబోయ్..అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..

Anand Mahindra: మా ట్రాక్టర్‌ నడపాలంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్న ఆనంద్‌ మహీంద్రా.. ఎందుకంటే..