Viral Video: కుమార్తెలకు టీ తయారు చేయడం నేర్పించిన యుఎస్ న్యూరో సర్జన్.. అది చాయ్ కాదు బాబోయ్..అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..
Viral Video: కొంతమంది చేసిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటే.. మరికొందరి వీడియోలు ఆకట్టుకోవు.. తాజాగా యుఎస్‌కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ సంజయ్ గుప్తా..
Viral Video: కొంతమంది చేసిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటే.. మరికొందరి వీడియోలు ఆకట్టుకోవు.. తాజాగా యుఎస్‌కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ సంజయ్ గుప్తా తన కుమార్తెలకు టీ ఎలా తయారు చేయాలో నేర్పించారు, అయితే వీడియో నెటిజన్‌లన్లను అంతగా ఆకట్టుకోలేదు. బ్రౌన్ షుగర్, మెత్తగా తరిగిన అల్లం, యాలకులు, బ్లాక్ టీ బ్యాగ్ ను ఉపయోగించి రుచికరమైన టీ ఎలా తయారు చేయాలో డాక్టర్ తన కూతుర్లకు నేర్పించారు అయితే ఈ టీ లుక్ పై నెటిజన్లు అసంతృప్తీ వ్యక్తం చేస్తున్నారు. చూడడానికి రంగు బాగోలేదు.. ఇక రుచి టీ లా ఉంటుందో.. లేక మరే రుచి అయినా వస్తుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
న్యూరోసర్జన్ డాక్టర్ గుప్తా తన తల్లి నుండి నేర్చుకున్న టీ తయారీని తన కుమార్తెలకు నేర్పించాడు. మూడున్నర నిమిషాల వీడియోలో వారు బ్రౌన్ షుగర్, మెత్తగా తరిగిన అల్లం, యాలకులు , బ్లాక్ టీ బ్యాగ్‌లను ఉపయోగించారు. అంతేకాదు.. టి తయారీకి తేయాకుల బదులు.. టి బ్యాగ్స్ బాగుంటాయని తెలిపారు.
అయితే ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. గుప్తా టీ తయారీ విధానం ఆకట్టుకోలేదని కామెంట్ చేస్తే.. మీరు తయారు చేసిన టీ.. అది హార్లిక్స్ లాగా ఉందని ఇంకొందరు.. చాయ్ రంగును చూడండి. అంటూ నవ్వుతున్న ఇమోజీలతో కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు డాక్టర్ గా మీరు బిజీగా ఉండి కూడా మీ ఫ్యామిలీతో కొంతసమయం గడపం బాగుందని అంటున్నారు.
Continuing family tradition, Dr. Sanjay Gupta teaches his daughters the chai recipe he learned from his mother. https://t.co/wVDFVQ6l67 pic.twitter.com/M4gxsjGxqu
— CNN (@CNN) December 9, 2021
Also Read: జబర్దస్త్ నుంచి కాదు.. ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ అవుట్..