నాడు ప్రపంచకప్ ఫైనల్.. నేడు యాషెస్.. ‘కింగ్’ బెన్ స్టోక్స్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 362 […]
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జో రూట్(77), జో డెన్‌లీ(50), బెయిర్ స్టో(36)లు రాణించారు. అయితే వరుస వికెట్లు పడగొట్టి ఆసీస్ ఓ దశలో ఆధిపత్యంలో వచ్చినా.. స్టోక్స్ ఒక్కడే నిలబడి ఆర్చర్(15) సాయంతో పరుగులు రాబట్టాడు. అయితే ఆర్చర్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కానీ బెన్ స్టోక్స్ పట్టుదలతో ఒక ఎండ్‌లో జాక్ లీచ్(1*)ను కాపాడుకుంటూ బ్యాట్ ఝుళిపించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4, లియోన్ 2, కమిన్స్, పాటిన్సన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ అఫ్ అది మ్యాచ్ బెన్ స్టోక్స్‌కు లభించగా.. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీ ప్రారంభమవుతుంది.