బుమ్రా విధ్వంసం.. విండీస్‌కు ‘బ్యాండ్ బాజా బారాత్’
విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. తొలి టెస్ట్‌లో కూడా ఘన విజయం సాధించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ(3/31), షమి(2/13)లు చెలరేగడంతో 419 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా విండీస్ 100 పరుగులకే కుప్పకూలింది. కీమర్ రోచ్(38; 31బంతుల్లో 1×4, 5×6) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ తక్కువ […]
విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. తొలి టెస్ట్‌లో కూడా ఘన విజయం సాధించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ(3/31), షమి(2/13)లు చెలరేగడంతో 419 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా విండీస్ 100 పరుగులకే కుప్పకూలింది. కీమర్ రోచ్(38; 31బంతుల్లో 1×4, 5×6) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
అంతకుముందు 185/3తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్ మరో 158 పరుగులు జోడించి 343/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అజింక్య రహానె(102; 242 బంతుల్లో 5×4) అజేయ సెంచరీతో పాటు.. హనుమ విహారి(93; 128బంతుల్లో 10×4, 1×6) అద్భుత ఇన్నింగ్స్ టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాగా రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.