మా కెప్టెన్‌కి బుర్ర లేదు.. ఛాపెల్ ఫైర్

మా కెప్టెన్‌కి బుర్ర లేదు.. ఛాపెల్ ఫైర్

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లండ్ జట్టుకు ఓటమి తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చేసిన తప్పిదం వల్ల ఆ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 7:35 PM

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లండ్ జట్టుకు ఓటమి తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చేసిన తప్పిదం వల్ల ఆ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బెన్‌ స్టోక్స్ అండగా ఉండి ఆదుకున్నాడు. అయితే నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టోక్స్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగాల్సింది. కానీ, అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. అప్పటికే ఆస్ట్రేలియా జాక్ లీచ్ వికెట్ కోసం రివ్యూ కోరి.. దాన్ని వృథా చేసింది. దీంతో స్టోక్స్ వికెట్‌ కోసం రివ్యూ తీసుకొనే అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో కెప్టెన్‌ టిమ్‌ పైన్‌పై మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిమ్ పైన్ బుర్ర పని చేయడం లేదనుకుంటా అని అన్నారు. కాగా, మ్యాచ్ అనంతరం పైన్ తాను చేసిన తప్పును అంగీకరించాడు. మరోసారి ఇలాంటివి వునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu