Asia Cup 2025 : హాంకాంగ్ పై అఫ్గానిస్థాన్ విధ్వంసం..ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు!
ఆసియా కప్ 2025లో మొదటి మ్యాచ్‌లోనే అఫ్గానిస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించి టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్, హాంకాంగ్‌పై 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ జట్టు హాంకాంగ్‌కు 189 పరుగుల లక్ష్యం ఇచ్చింది. కానీ హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ మీద భారీ విజయం సాధించి టోర్నమెంట్‌ను అద్భుతంగా ప్రారంభించింది. అఫ్గానిస్తాన్ హాంకాంగ్‌కు 189 పరుగుల లక్ష్యం ఇచ్చింది. దానికి సమాధానంగా, హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 94 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.
బ్యాట్స్‌మెన్ల ధమాకా
షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గానిస్తాన్ ఓపెనింగ్ సరిగా లేదు. 26 పరుగులకే గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ వికెట్లు కోల్పోయింది. అయితే, సెదికుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్), అజ్మతుల్లా ఉమర్‌జాయ్ (21 బంతుల్లో 53) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 35 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీనితో, అఫ్గానిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఉమర్‌జాయ్ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. అటల్ 3 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. మహ్మద్ నబీ కూడా 26 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
రికార్డులు బద్దలుకొట్టిన ఉమర్‌జాయ్
ఉమర్‌జాయ్ సాధించిన ఈ హాఫ్ సెంచరీ అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మెన్లలో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఉమర్‌జాయ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి.. నబీ, గులాబ్దిన్ 21 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. హాంకాంగ్ తరపున ఆయుష్ శుక్లా 2, కించిత్ షా 2, అతీక్ ఇక్బాల్, ఎహసాన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కుప్పకూలిన హాంకాంగ్
189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టుకు ఆరంభం చాలా చెత్తగా ఉంది. 22 పరుగులకే నాలుగు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అక్కడే మ్యాచ్ దాదాపుగా ముగిసింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కేవలం 20 ఓవర్లు పూర్తయ్యే వరకు క్రీజ్‌లో ఉండాలనే లక్ష్యంతో ఆడారు. బాబర్ హయాత్ ఒక్కడే అఫ్గానిస్తాన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. బాబర్ 43 బంతుల్లో 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు.
అఫ్గానిస్తాన్ తరపున, గులాబ్దిన్ నైబ్ 3 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఫజల్‌హక్ ఫారూఖీ 2, ఉమర్‌జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




