న్యూఢిల్లీ: టీట్వంటీల్లో ఆఫ్గనిస్థా్న్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఇది టీ20ల్లో అత్యధిక స్కోర్. అంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా చేసిన 263 పరుగులే ఇప్పటి వరకూ అత్యధికం.
ఆఫ్గనిస్థాన్ జట్టు ఓపెనర్‌గా బరిలో దిగిన జాజాయ్ కేవలం 62 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 16 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘని 48 బంతుల్లో 73 పరుగులు చేశాడు.