AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Rumors: ఆఫ్ఘన్ క్రికెటర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ

Wedding Rumors: బిగ్ బాస్ ఫేమ్, బాలీవుడ్ నటి అర్షి ఖాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఆఫ్తాబ్ ఆలం పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్వయంగా అర్షి ఖాన్ తెరదించారు. ఈ డేటింగ్, పెళ్లి పుకార్లపై ఆమె స్పందిస్తూ అసలు నిజాలేమిటో వివరిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Wedding Rumors: ఆఫ్ఘన్ క్రికెటర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Arshi Khan
Rakesh
|

Updated on: Aug 13, 2026 | 5:28 PM

Share

Wedding Rumors: హిందీ బిగ్ బాస్ సీజన్ 11 ద్వారా గుర్తింపు తెచ్చుకుని త్రాహిమామ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి అర్షి ఖాన్. ఆమె ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఆఫ్తాబ్ ఆలంతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్షి ఖాన్ ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని, వారిద్దరూ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బావ-మరదళ్ల బంధం లాంటి స్నేహం

అర్షి ఖాన్ మాట్లాడుతూ.. “నాకు ఆఫ్తాబ్ 2020 నుంచి తెలుసు. నాటి నుంచి మేమిద్దరం చాలా మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మా మధ్య స్నేహం చాలా ప్రత్యేకమైనది. ఒకరికొకరం కజిన్స్ లేదా బావ-మరదళ్ల లాంటి అనుబంధంతో ఉంటాం” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆఫ్తాబ్ ఆలమ్‌కు ఇప్పటికే పెళ్లయిందని, అతనికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు. కాబట్టి తమ మధ్య ఎలాంటి భవిష్యత్తు లేదా పెళ్లి ఆలోచనలు ఉండవని క్లియర్‌గా చెప్పేశారు.

సీక్రెట్‎గా కోర్టు మ్యారేజ్ చేసుకుంటా

ఇదే ఇంటర్వ్యూలో అర్షి ఖాన్ తన పెళ్లి ప్లాన్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సైలెంట్‌గా, హడావుడి చేయకుండా కోర్టు మ్యారేజ్ చేసుకుంటానని తెలిపారు. కాగా, అర్షి ఖాన్ (36) ఆఫ్ఘన్ క్రికెటర్ ఆఫ్తాబ్ ఆలం (33) కంటే వయసులో మూడేళ్లు పెద్ద కావడం గమనార్హం.

ఆఫ్తాబ్ ఆలం క్రికెట్ కెరీర్

ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అయిన ఆఫ్తాబ్ ఆలం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 27 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 41 వికెట్లు, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టారు. అతను 2012లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేయగా, 2018లో చివరి టీ20 మ్యాచ్ ఆడారు. అలాగే 2019లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన ఆఫ్తాబ్, గత కొంతకాలంగా ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us