Tori Bowie: రియో ఒలింపిక్‌ పతక విజేత మృతి.. తన ఇంట్లోనే విగతజీవిగా..! అసలేంజరిగిందంటే..

రియో ఒలంపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన అమెరికన్‌ స్ప్రింటర్‌, యువ అథ్లెట్‌, లాంగ్‌ జంపర్‌ అయిన టోరీ బోవీ (32) మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నివాసముంటున్న క్రీడాకారిణి టోరీ బోవీ గత కొన్ని రోజులుగా బయట కన్పించట్లేదు. దీంతో స్థానిక అధికారులు ఆమె యోగక్షేమాలు..

Tori Bowie: రియో ఒలింపిక్‌ పతక విజేత మృతి.. తన ఇంట్లోనే విగతజీవిగా..! అసలేంజరిగిందంటే..
Tori Bowie
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2023 | 8:09 AM

రియో ఒలంపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన అమెరికన్‌ స్ప్రింటర్‌, యువ అథ్లెట్‌, లాంగ్‌ జంపర్‌ అయిన టోరీ బోవీ (32) మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నివాసముంటున్న క్రీడాకారిణి టోరీ బోవీ గత కొన్ని రోజులుగా బయట కన్పించట్లేదు. దీంతో స్థానిక అధికారులు ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు టోరీ బోవీ ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె విగతజీవిగా కనిపించారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు ఆమె మేనేజ్‌మెంట్‌ కంపెనీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. ఆమెది సహజమరణం అయి ఉండొచ్చని, అనుమానస్పద మృతిగా పరిగణించట్లేదని అధికారులు పేర్కొన్నారు. టోరీ మృతి పట్ల ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, తోటి ఒలింపిక్‌ ఛాంపియన్లు, అథ్లెట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా మిస్సిస్సిప్పిలో పుట్టిపెరిగిన టోరీ బోవీ యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిస్సిస్సిప్పిలో అథ్లెటిక్ స్కాలర్‌షిప్ సాధించారు. 2011లో ఇండోర్‌, ఔట్‌డోర్‌ లాంగ్‌ జంప్‌ నేషనల్ టైటిళ్లను గెలుపొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో 4×100 మీటర్‌ రిలే విభాగంలో స్వర్ణం, 100 మీటర్ల రిలే విభాగంలో రజతం, 200 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించారు. రియో ఒలింపిక్స్‌లో టోరీ మొత్తం మూడు పతకాలు సాధించారు. 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ 100 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ సాధించి వరల్డ్‌ ఛాంపియన్‌గా రికార్డు నెలకొల్పారు. 2022 జూన్‌లో ఆమె చివరిసారిగా అధికారిక పోటీల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే