SRH vs KKR IPL 2023: ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం.. 5 పరుగుల తేడాతో గెలుపు
హైదరాబాద్‌తో జరిగిన పోరులో కోల్‌కతా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాద్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది..
ఐపీఎల్-16లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాద్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. కోల్‌కతా స్కోర్ 171/9, హైదరాబాద్ స్కోర్ 166/8. కోల్‌కతా బ్యాటింగ్: రింకూసింగ్ 46, నితీష్ 42, రస్సెల్ 24, జేసన్ రాయ్ 20 పరుగులు చేశారు. ఇక హైదరాబాద్ బౌలింగ్: జన్‌సేన్, నటరాజన్‌కు చెరో 2 వికెట్లు, భువనేశ్వర్, త్యాగి, మర్‌క్రమ్, మయాంక్ తలో వికెట్ తీశారు.