Investment: ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు.. పెట్టుబడుల్లో మిమ్మల్ని ఆపే వారే ఉండరు.

ఆర్థిక స్వేచ్ఛకోసం అన్వేషణలో భారతీయులు మ్యూచువల్ ఫండ్స్వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. AMFI ప్రకారం భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో అసాధారణ వృద్ధి సాధించినట్లు తేలింది. 2013 ఆగస్టు 31నాటికి రూ. 7.66 ట్రిలియన్లుగా ఉన్న మొత్తం ఆగస్టు 31, 2023 నాటికి రూ. 46.63 ట్రిలియన్లకు పెరగడం గమనార్హం. పదేళ్ల కాలంలో ఏకంగా 6 రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

Investment: ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు.. పెట్టుబడుల్లో మిమ్మల్ని ఆపే వారే ఉండరు.
Axis
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2023 | 4:43 PM

భారతీయుల ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పుడు సగటు ఉద్యోగి కానీ, చిరు వ్యాపారి కానీ సంపాదించిన డబ్బులో కాస్త దాంచుకుంటే చాలు అనే ఆలోచనలో ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మారుతోన్న మార్కెట్కు అనుగుణంగా భారతీయుల మైండ్సైట్లో మార్పులు వస్తున్నాయి. దాచుకోవడం నుంచి పెట్టుబడులు పెట్టే స్థాయికి భారతీయులు ఎదుగుతున్నారు. తాజాగా నమోదవుతోన్న గణంకాలే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు.

ఆర్థిక స్వేచ్ఛకోసం అన్వేషణలో భారతీయులు మ్యూచువల్ ఫండ్స్వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. AMFI ప్రకారం భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో అసాధారణ వృద్ధి సాధించినట్లు తేలింది. 2013 ఆగస్టు 31నాటికి రూ. 7.66 ట్రిలియన్లుగా ఉన్న మొత్తం ఆగస్టు 31, 2023 నాటికి రూ. 46.63 ట్రిలియన్లకు పెరగడం గమనార్హం. పదేళ్ల కాలంలో ఏకంగా 6 రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో లాభనష్టాలను అంచనా వేయడం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకునేందుకు రిస్కోమీటర్, రిస్క్ ప్రొఫైలర్ వంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ ఓ మీటర్ అనేది మ్యూచుఫల్ ఫండ్ లావాదేవీలకు సంబంధించిన ఒక గ్రాఫికల్ సమాచారం. ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత రిస్క్ ఉంటుంది.? ఎంత లాభం ఉంటుంది.? లాంటి వివరాలను ఇందులో గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు. ఈ టూల్స్ ఆధారంగా కస్టమర్లకు ఎప్పుడు, ఎక్కడ పెట్టుబడులు పెడితే నష్టపోరు, ఎప్పుడు లాభాలు గడిస్తారు లాంటి వివరాలను పొందొచ్చు. ఇంతకీ ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి.? వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

రిస్కోమీటర్ను అంచనా వేయడానికి ముందు మీ స్వంత రిస్క్ టాలరెన్స్ను బేరీజువేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు, మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి లాంటి అంశాలను పరిగణలోకి తీకుంటుంది. రిస్కోమీటర్లో స్కేల్ ఏ విషయాన్ని సూచిస్తుందన్న విషయంపై స్పష్టతతో ఉండాలి. వీటిలో చూపించే రిస్క్ స్థాయి ఆధారంగా పెట్టుబడులు ఎలా పెట్టాలన్నదానిపై కస్టమర్లకు ఓ క్లారిటీ వస్తుంది. మీ రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉండే మ్యూచ్ఫల్ ఫండ్లను ఎంపికచేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీరు ఒకవేళ డబ్బులు ఎక్కువ రిటర్న్ రాకపోయినా పర్లేదు కానీ రిస్క్ ఉండకూడదనకుంటే.. తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడులు సెలక్ట్ చేసుకోవచ్చు. లేదు అస్థిరతను తట్టుకోగలము, ఎక్కువ లాభాలు రావాలని ఆశిస్తే ఎక్కువ రిస్క్ ఫండ్లను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక రిస్క్ ఫండ్స్‌ లోనూ కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు.

ఏంటీ రిస్క్ ప్రొఫెలర్..

రిస్క్ ప్రొఫెలర్ టూల్ ద్వారా ఇన్వెస్టర్లు తమ ప్రశ్నలను, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దీంతో కస్టమర్లు తమ వ్యక్తిగత రిస్క్ టాలరెన్స్ను మరింత సమగ్రంగా అంచనా వేసుకోవచ్చు. పెట్టుబడిదారులకు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా సరైన అవగాహన కల్పిస్తుందీ టూల్. ఇలాంటి రిస్క్ ఫ్రొఫెలర్లో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రొఫైలర్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. పెట్టుబడి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రిస్క్ ప్రొఫెలర్ కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇవి రిస్క్ ప్రొఫైల్ను లెక్కించడానికి ఉపయోగపడతాయి. మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా.. రిస్క్ ప్రొఫెలర్ మీకు రిస్క్ టాలరెన్స్, మీ ఆర్థిక లక్ష్యాలకు సరిగ్గా సరిపోయే మ్యూచువల్ ఫండ్ లేదా పోర్ట్ ఫోలియోను సిఫార్లు చేస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం సూచించదగ్గ అంశంగా చెప్పొచ్చు. ఈ సూచనలు మీరు కోరుకునే రిస్క్ స్థాయికి అనుగుణంగా ఉండే ఫండ్స్ను సూచించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అయితే రిస్క్ ప్రొఫైలింగ్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా చెక్ చేసుకుంటూ ఉండాలి.

రిస్కోమీటర్, రిస్క్ ప్రొఫైలర్ రెండూ పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందించడంలో ఉపయోగపడతాయి. దీంతో ఇన్వెస్టర్లు వీలైనంత వరకు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి. ఈ టూల్స్ ద్వారా ఇన్వెస్టర్లు వారుఎంచుకున్న ఫండ్ల స్థితిగతులను అంచనా వేయొచ్చు.

ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు పొందడానికి కస్టమర్స్ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఈ వెబ్సైట్లోకి (www.axismf.com) వెళ్లాల్సి ఉంటుంది. లేదా ఈ మెయిల్ ఐడీకి (customerservice@axismf.com) సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్స్ కేవలం రిజిస్టర్ మ్యూచుఫల్ ఫండ్స్తోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో (www.sebi.gov.in) పొందొచ్చు. మరిన్ని సందేహాల నివృత్తి కోసం 1800221322 లేదా customerservice@axismf.com మెయిల్ ఐడీకి సంప్రదించాల్సి ఉంటుంది. రిస్క్ ప్రొఫైలర్ టూల్ కేవలం మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా మీ రిస్క్ ప్రొఫెల్ను అంచనా వేస్తుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో ఇన్వెస్టర్లదే తుది నిర్ణయమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి