టెక్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న OZRIT.. మరో 3 ప్రధాన నగరాల్లో విస్తరణ
ఆజ్రిట్ (Ozrit).. దేశంలోని ప్రముఖ టెక్ నగరాలైన బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైల్లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా సంస్థ భారతదేశంలో తన స్థితిని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న డిజిటల్ సేవల అవసరాలను..

బెంగళూరు, అక్టోబర్ 28: దేశంలోని అగ్రగామి వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ టెక్నాలజీ సంస్థ ఆజ్రిట్ (Ozrit).. ప్రముఖ టెక్ నగరాలైన బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైల్లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా సంస్థ భారతదేశంలో తన స్థితిని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న డిజిటల్ సేవల అవసరాలను తీర్చేందుకు సిద్ధమవుతోంది. ఆజ్రిట్ ఇప్పటికే ఈ నగరాల్లో కార్యాలయాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు సంస్థ తన బృందాలను, సాంకేతిక మౌలిక సదుపాయాలను, ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరించి, కొత్త ప్రాజెక్టులకు మరింత వేగంగా, నాణ్యతతో సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
భారతదేశం డిజిటల్ రంగంలో వేగంగా ఎదుగుతోంది. ఆ మార్పులో భాగమవ్వడం మాకు గర్వకారణమని ఆజ్రిట్ CEO భరత్ గుప్త అన్నారు. ఆజ్రిట్‌లో మేము కేవలం వెబ్‌సైట్లు లేదా యాప్‌లు నిర్మించడం కాదు. వ్యాపారాలకు విలువను సృష్టించే సాంకేతిక పరిష్కారాలను అందించడం మా లక్ష్యం. బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై నగరాల్లో విస్తరించడం ద్వారా మేము స్థానిక మార్కెట్‌కు మరింత దగ్గరగా పనిచేయగలుగుతాం. ప్రతిభావంతులైన టెక్ నిపుణులను ఆకర్షించగలుగుతామని ఆయన తెలిపారు. ఆజ్రిట్ ఇప్పటికే భారతదేశంలో అగ్రశ్రేణి వెబ్ డెవలప్మెంట్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, కస్టమ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, క్లౌడ్ ఇంటిగ్రేషన్ వంటి సేవలలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంది.
మాకు టెక్నాలజీ అంటే కేవలం సాధనం కాదు. అది కలలను సాకారం చేసే శక్తి. ఈ విస్తరణ కొత్త కార్యాలయాల గురించేం కాదు. ఇది మన దృష్టిని మరింత విస్తరించే అడుగు. సృజనాత్మక ఆలోచనతో కలిసిన గొప్ప టెక్నాలజీ వ్యాపారాలను మాత్రమే కాకుండా, మనుషులను కూడా అనుసంధానించే శక్తిగా మారుతుందని భరత్ గుప్త అన్నారు. భారతదేశంలోని స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు పెద్ద ఎంటర్‌ప్రైజ్‌లు కూడా ఆజ్రిట్ సేవలపై నమ్మకాన్ని ఉంచుతున్నాయని అన్నారు. ఈ విస్తరణతో సంస్థ దేశంలోని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనుంది.
కాగా ఆజ్రిట్ భారతదేశంలో ఉన్న పూర్తి స్థాయి ఐటీ, వెబ్ డెవలప్మెంట్ సంస్థ. వెబ్‌సైట్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌లలో నైపుణ్యంతో ఈ కంపెనీ దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలకు డిజిటల్ విజయాన్ని అందిస్తోంది.




