Oasis Janani Yatra: మాతృత్వం పట్ల గౌరవానికి ప్రతీకగా ‘ఒయాసిస్ జననీ యాత్ర’ ప్రయాణం.. ఉచిత ఫర్టిలిటీ క్యాంప్స్
Oasis Janani Yatra: "టైర్-2, 3 పట్టణాలలో అవగాహన లోపం ఆలస్య చికిత్సకు దారితీస్తుందని డాక్టర్ కృష్ణ చైతన్య ఎం (సైంటిఫిక్ హెడ్) అన్నారు. జననీ యాత్ర ద్వారా ప్రత్యేక సంరక్షణను ప్రజల ద్వారానే తీసుకువస్తున్నాం. ఇది చికిత్స మాత్రమే కాదు, జంటల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయాణం" అని అన్నారు..

మే 8, 2025న హైదరాబాద్‌లో ప్రారంభమైన ఒయాసిస్ జననీ యాత్ర, ఇప్పటివరకు తెలంగాణలోని జనగామ, జగిత్యాల్, ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు (నెల్లూరు జిల్లా) వంటి టైర్-2 పట్టణాలలో ఉచిత ఫర్టిలిటీ క్యాంప్‌లను నిర్వహించింది. ఈ రోజు మార్కాపురంలో ఈ సేవలను విస్తరిస్తున్నాము. గత 3 క్యాంప్‌లలో 200కి పైగా జంటలకు ఉచిత సలహాలు, రక్తపరీక్షలు, వీర్య విశ్లేషణలతో సహాయం చేశారు. ప్రజలు ఈ కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ చివరిదాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 30 జిల్లాలలో 2000 జంటలకు పైగా ఫర్టిలిటీ సంబంధిత విద్య, ఉచిత చికిత్సలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
సవాళ్లు, ప్రాముఖ్యత:
ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 1.7కి తగ్గడంతో వంధ్యత్వం ప్రజారోగ్య సమస్యగా మారింది. ఇంటికి దగ్గరగా నాణ్యమైన ఫర్టిలిటీ సేవల అవసరాన్ని గుర్తించిన ఒయాసిస్, మొబైల్ క్లినిక్ ద్వారా అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల సలహాలను గ్రామీణ ప్రాంతాలకు చేరుపరుస్తోంది. ఈ క్యాంప్‌లలో మహిళలకు ఉచిత ఏఎంహెచ్, హీమోగ్లోబిన్ టెస్టులు, పురుషులకు వీర్య విశ్లేషణలు అందిస్తున్నాం. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలపై జంటలతో అవగాహన సెషన్లు నిర్వహిస్తున్నాని ఒయాసిస్ జననీ యాత్ర వెల్లడించింది.

అవగాహన లోపం: డాక్టర్ కృష్ణ చైతన్య ఎం (సైంటిఫిక్ హెడ్):
“టైర్-2, 3 పట్టణాలలో అవగాహన లోపం ఆలస్య చికిత్సకు దారితీస్తుందని డాక్టర్ కృష్ణ చైతన్య ఎం (సైంటిఫిక్ హెడ్) అన్నారు. జననీ యాత్ర ద్వారా ప్రత్యేక సంరక్షణను ప్రజల ద్వారానే తీసుకువస్తున్నాం. ఇది చికిత్స మాత్రమే కాదు, జంటల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయాణం” అని అన్నారు.
సంతానలేమి వైద్య సమస్య కాదు: డాక్టర్ దీపిక (క్లినికల్ హెడ్):
“సంతానలేమి ఇప్పుడు కేవలం వైద్య సమస్య కాదు. జీవనశైలి సవాళ్లు కూడా దీనికి కారణం. సత్వర నిర్ధారణ, నిపుణుల సలహాలతో మేం ప్రతి జంట వద్దకు సేవలు చేరుపరుస్తున్నాం.” అని డాక్టర్ దీపిక అన్నారు.
ముందున్న ప్రణాళికలు:
జూన్ 2025 లోపు రెండు రాష్ట్రాల్లో 30 జిల్లాలను తాకేలా ఈ యాత్రను విస్తరిస్తున్నామని తెలిపింది. ప్రతి క్యాంప్‌లో సురక్షితమైన శాంపుల్ కలెక్షన్, డిజిటల్ డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నామని, “ఆలస్యం చేయకండి – సమయానికి అవగాహన, చర్యలే జంటల సంతాన సాఫల్యానికి మూలాలు” అని ఒయాసిస్ ఫర్టిలిటీ ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.
ఒయాసిస్ ఫర్టిలిటీ గురించి..
2009లో స్థాపించిన ఈ సంస్థ, భారతదేశంలో 19 నగరాల్లో 31 కేంద్రాలతో 1,00,000+ శిశువుల జననంలో పాత్ర పోషించింది. ఐవీఎఫ్, ఐయూఐ వంటి అధునాతన చికిత్సలతో పాటు సమగ్ర ఫర్టిలిటీ సేవలను అందిస్తుంది.





