AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oasis Fertility: ఒయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’కు విశేష స్పందన.. MLC మధుసూదన్ ప్రశంసల జల్లు

మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన 'జనని యాత్ర'లో భాగంగా, ఆదోనిలో ప్రత్యేకంగా ఉచిత ఫెర్టిలిటీ అవగాహన క్యాంప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు డాక్టర్‌ ఎ. మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై, మొబైల్ ఫెర్టిలిటీ బస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య సేవల్ని అందించడంలో ఒయాసిస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు..

Oasis Fertility: ఒయాసిస్ ఫెర్టిలిటీ 'జనని యాత్ర'కు విశేష స్పందన.. MLC మధుసూదన్ ప్రశంసల జల్లు
Oasis Fertility
Srilakshmi C
|

Updated on: Jun 07, 2025 | 7:49 PM

Share

అదోని, జూన్ 6, 2025: మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన ‘జనని యాత్ర’లో భాగంగా, ఆదోనిలో ప్రత్యేకంగా ఉచిత ఫెర్టిలిటీ అవగాహన క్యాంప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు డాక్టర్‌ ఎ. మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై, మొబైల్ ఫెర్టిలిటీ బస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య సేవల్ని అందించడంలో ఒయాసిస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా డా. ఎ. మధుసూదన్ మాట్లాడుతూ.. ఒయాసిస్ ఫెర్టిలిటీ నిర్వహిస్తున్న ‘జనని యాత్ర’ అనే ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఉచితంగా ఫెర్టిలిటీ సలహాలు, రక్తపరీక్షలను గ్రామీణ ప్రజలకు అందించడం ఎంతో అభినందనీయం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో జనన రేటు తగ్గిపోతున్న విషయంపై స్పందించారు. ఆయన చెప్పినట్లే, జనాభాలో యువత తగ్గిపోతూ వృద్ధుల సంఖ్య పెరగడం ఒక భవిష్యత్తు సమస్యగా మారవచ్చు.

ఈ నేపథ్యంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన జనని యాత్ర క్యాంప్, ఫెర్టిలిటీపై ప్రజలకు అవగాహన కల్పించడం, అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం చాలా కీలకమైంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ గ్రామీణ ప్రజలకు సైన్సు ఆధారిత ఫెర్టిలిటీ సేవలు అందించేందుకు చేసిన ఈ గొప్ప ప్రయత్నానికి శుభాకాంక్షలు. ఇంకా చాలా ప్రాంతాలకు ఈ సేవలు చేరాలన్నది నా ఆకాంక్ష అని ఆయన ఆన్నారు. అనంతరం ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్‌ కృష్ణ చైతన్య మాట్లాడుతూ:

‘ఈ క్యాంప్‌ను మేము మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించాం. గత 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 30కి పైగా పట్టణాలలో ఈ మొబైల్ యాత్ర జరిపాము. దాదాపు 700 మందికి పైగా దంపతులకు ఉచిత సలహాలు, బ్లడ్ టెస్టులు, కౌన్సెలింగ్ అందించాం. పట్టణ ప్రాంతాల్లో ఫెర్టిలిటీపై అవగాహన తక్కువగా ఉండటంతో ఈ క్యాంప్ ఎంతో అవసరమైందని అన్నారు. కర్నూలు ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ డా. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ఇప్పటి పరిస్థితుల్లో వందలాది దంపతులు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, సిమి అర్బన్ ప్రాంతాల్లో అవగాహనలేమి, సదుపాయాల లేకపోవడం వల్ల వారు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. అందుకే జనని యాత్ర ద్వారా మేము ప్రజలలో అవగాహన కల్పించడం, సైంటిఫిక్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడం, స్టిగ్మాను తొలగించడం మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి మంచి స్పందన అందుతోందని ఆమె అన్నారు.

19 నగరాలలో 31  ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్రాంచులు

కాగా 2009లో స్థాపించబడిన ఒయాసిస్ ఫెర్టిలిటీ.. దేశవ్యాప్తంగా 19 నగరాలలో 31 సెంటర్లతో విస్తరించి ఉంది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా శిశువులను విజయవంతంగా జన్మింపజేసిన ఈ సంస్థ.. IVF, IUI, ICSI, పురుషుల వంధ్యత్వం, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి అన్ని సేవల్ని అందిస్తుంది. సాంకేతికంగా ఆధునికంగా ఉండే ఈ సంస్థ పారదర్శకత, కేర్, శాస్త్రీయ వైద్య సేవలతో ప్రజలకు సేవలందించడంలో ముందుంది.