AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SASA LELE: ఫ్లిప్‌కార్ట్‌ డబుల్ సేల్ 2X ఆఫర్లు, 2X విలువ సేల్! స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు తగ్గింపు!

ఫ్లిప్‌కార్ట్‌ Sasa Lele సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై 50 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. Apple, Samsung, ASUS వంటి బ్రాండ్లపై అద్భుతమైన డీల్స్‌తో పాటు, డబుల్ డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI కార్డులతో అదనపు తగ్గింపులు లభిస్తాయి.

SASA LELE: ఫ్లిప్‌కార్ట్‌ డబుల్ సేల్ 2X ఆఫర్లు, 2X విలువ సేల్! స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు తగ్గింపు!
Sasa Lele Sale
SN Pasha
|

Updated on: Apr 30, 2025 | 6:07 PM

Share

ఫ్లిప్‌కార్ట్‌ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వస్తోంది. గతంలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌తో హడావుడి చేసిన ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు దాన్ని మించిన భారీ తగ్గింపుల సేల్‌ తీసుకొస్తోంది. దీనికి SASA LELE సేల్‌ అని పేరు పెట్టింది. ఇది కేవలం సేల్‌ మాత్రమే కాదని, డబుల్‌ సేల్‌ అంటూ ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ఇందులో భారీ తగ్గింపులతో పాటు డబుల్‌ డిస్కౌంట్లు, డబుల్‌ ఆఫర్లు, బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్లు, ఈఎంఐ ఆఫర్లతో గతంలో మునుపెన్నడు లేని విధంగా పలు వస్తువులపై భారీ తగ్గింపులు ఇవ్వనుంది. ఈ SASA LELE సేల్‌లో మరో విశేషం ఏంటంటే.. ఈ సారి భారీ ఆఫర్లతో పాటు స్మార్ట్‌ ఫోన్లను కేవలం 10 నిమిషాల్లోనే డెవలరీ చేయనున్నారు. గతంలో మూడు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు డెలవరీకి టైమ్‌ పట్టేది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌ డెలవరీ విషయంలో పెను మార్పులు తీసుకురానుంది.

మొబైల్స్‌పై మెగా ఆఫర్‌లు!

ఆపిల్ ఐఫోన్ 16 కేవలం రూ.59,999లకే లభించనుంది.

నథింగ్ ఫోన్ (3ఏ) సిరీస్ – కేవలం రూ.21,999లకే లభించనుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌24 5G కేవలం రూ.44,999లకే అందుబాటులో ఉండనుంది.

ల్యాప్‌టాప్‌లపై బ్లాక్‌బస్టర్ డీల్స్!

ASUS ExpertBook P1 – ASUS ExpertBook P1 P1403CV-I515X అనేది 14-అంగుళాల పూర్తి HD డిస్ప్లే, ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్, 16GB DDR5 RAM, 512GB SSDని కలిగిన ఉన్న ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ఇది USB-C, HDMI, గిగాబిట్ ఈథర్నెట్‌తో సహా బలమైన కనెక్టివిటీ ఎంపికలను అందిస్తుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ Book4 – Intel Core i5-13 జనరేషన్‌, 16GB RAMతో కూడిన సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్‌4 15.6-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లేను అందిస్తుంది. Intel Iris Xe గ్రాఫిక్స్‌తో అమర్చబడి, ఇది మృదువైన మల్టీ టాస్కింగ్‌కు ఉపయోగపడుతుంది. 512GB SSDతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ కూడా భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉండనుంది.

TVలపై బంపర్ డీల్స్!

సామ్‌సంగ్‌ 55 ఇంచుల అల్ట్రా HD (4K) LED టైజెన్ టీవీ క్రిస్టల్ 4K డిస్ప్లే, క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో ఆకర్షణీయమైన దృశ్యాలను అందిస్తుంది, ఇది సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. HDR సపోర్ట్‌, మల్టీ వాయిస్ అసిస్టెంట్లు, 3-సైడ్ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. ఈ టీవీ కూడా సూపర్‌ ఆఫర్‌తో అందుబాటులో ఉండనుంది.

LG 43 అంగుళాల అల్ట్రా HD (4K) LED WebOS టీవీ α5 Gen5 AI ప్రాసెసర్, 4K రిజల్యూషన్, HDR సపోర్ట్‌తో వస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు ఆకర్షణీయమైన ఆడియో కోసం AI సౌండ్‌తో కలిగి ఉంది. ఈ టీవీ కూడా అతి తక్కువ ధరకు లభిస్తుంది.

సోనీ 65 అంగుళాల అల్ట్రా HD (4K) LED గూగుల్ టీవీ 4K రిజల్యూషన్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. X1 ప్రాసెసర్, మోషన్‌ఫ్లో XR 100, డాల్బీ ఆడియోతో వస్తుంది. ఈ టీవీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

ఇతర ఆఫర్లు..

ఈ సేల్‌లో Redmi A3, Realme Narzo N53, Infinix Smart 8 HD.. 90Hz డిస్ప్లేలు, 5000mAh బ్యాటరీ, AI కెమెరాలు వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ ఫోన్లు వలం రూ.10 వేల లోపే అందుబాటులో ఉండనున్నాయి.

Flipkart – SBIతో భాగస్వామ్యంతో స్మార్ట్‌ఫోన్‌లపై అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. Apple, Samsung, Xiaomi, Vivo వంటి బ్రాండ్‌లలో నో-కాస్ట్ EMI ఆఫ్షన్‌ కూడా ఉంది.

ఇక Flipkart Plus సభ్యులు ఒక రోజు ముందుగానే ఈ ఆఫర్లను అందుకోవచ్చు. ఈ SASA LELE సేల్‌ మే 2 నుంచి ప్రారంభం కానుంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు మే 1 నుంచే యాక్సెస్‌ ఉంటుంది.

వీడియో చూడండి..