AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today:పసిడి ప్రియులకు సూపర్ గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

బంగారం కొనేవారికి ఇదొక గుడ్‌న్యూస్ చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దూసుకెళ్తున్న బంగారం పరుగులకు సడెన్ బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టి కొనుగోలు దారులకు స్వల్ప ఊరటను ఇచ్చాయి. గురువారంతో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధరల్లో స్పల్ప మార్పులు కనిపించాయి. కాబట్టి ప్రస్తుతం దేశీయ మార్కెట్‌ , తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Gold Price Today:పసిడి ప్రియులకు సూపర్ గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Latest Gold Price
Anand T
|

Updated on: Apr 24, 2026 | 10:49 AM

Share

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటాయి. ఒకనొక సందర్భంలో పసిడి ధరలు ఆల్‌టైం హైకి రూ.2లక్షలకు చేరువలోకి వెళ్లాయి. అటు వెండి ధరలు కూడా దాదాపు రూ.4లక్షలకు దగ్గర్లోకి చేరాయి. కానీ తాజాగా అంతర్జాతీయం నెలకొన్ని పరిస్థితుల కారణంగా గత రెండ్రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారంపై రూ.600 వరకు తగ్గింది. ఇక కేజీ వెండిపై కేవలం రూ.100 మాత్రమే తగ్గింది.

ఈరోజు బంగారం ధరలు

తాజాగా హెచ్చతగ్గుల తర్వాత హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న బంగారం, వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ప్రస్తుతం రూ.1,52,950 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,200 వద్ద స్థిరపడింది. నిన్నటితో పొల్చుకుంటే 24క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గింది.

హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఇలా

  • హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,350 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,000 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.
  • కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.

వెండి ధర

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా బంగారం బాటలోనే నడుతుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కూడా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేవీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,59,900 దగ్గర కొనసాగుతుండగా హైదరాబాద్‌, చెన్నై, కేరళలో రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us