AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి.. డెలివరీ డేట్ ఫిక్స్!

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతోంది. ఒకప్పుడు వెండితెరపై సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయిన అద్భుతాలు ఇప్పుడు మన కళ్లముందే వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఈ సాంకేతిక విప్లవంలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఎక్స్‌పెంగ్ (XPeng) సంచలనం సృష్టిస్తోంది. 2027 నాటికి రవాణా - రోబోటిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది.

గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి.. డెలివరీ డేట్ ఫిక్స్!
China's Xpeng Flying Cars
Balaraju Goud
|

Updated on: Apr 24, 2026 | 11:08 AM

Share

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతోంది. ఒకప్పుడు వెండితెరపై సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయిన అద్భుతాలు ఇప్పుడు మన కళ్లముందే వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఈ సాంకేతిక విప్లవంలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఎక్స్‌పెంగ్ (XPeng) సంచలనం సృష్టిస్తోంది. 2027 నాటికి రవాణా – రోబోటిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది.

భవిష్యత్తులో కార్లు కేవలం రోడ్లపైనే కాదు, ఆకాశంలోనూ విహరించనున్నాయి. ఎక్స్‌పెంగ్ అభివృద్ధి చేస్తున్న ఫ్లయింగ్ కార్లు సాధారణ వాహనాల్లాగే రోడ్డుపై ప్రయాణిస్తాయి. అవసరమైనప్పుడు రెక్కలు విప్పుకుని గాలిలోకి ఎగురుతాయి. దీంతో ప్రధాన నగరాల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన ట్రాఫిక్ జామ్‌ల నుండి ప్రయాణికులకు విముక్తి లభిస్తుంది. 2027 నాటికి వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. భద్రతా నిబంధనలు, ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఈ వినూత్న వాహనాల కోసం ఇప్పటికే భారీగా బుకింగ్‌లు వస్తుండటం విశేషం.

రవాణా రంగమే కాకుండా, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీలోనూ ఎక్స్‌పెంగ్ వేగంగా పనిచేస్తోంది. ఈ రోబోట్లు మనుషులలాగే నడవగలవు, వస్తువులను పట్టుకోగలవు. సంభాషించగలవు. తొలుత వీటిని కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, కస్టమర్ సర్వీస్ కేంద్రాల్లో రిసెప్షనిస్టులుగా నియమించనున్నారు. 2026 చివరి నాటికి వీటి ఉత్పత్తిని ప్రారంభించి, రాబోయే రోజుల్లో ఇంటి పనులకు కూడా సహాయపడేలా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

చివరగా, ఎక్స్‌పెంగ్ దృష్టి డ్రైవర్ లేని వాహనాలపై (Autonomous Vehicles) ఉంది. ఇవి పూర్తిగా సాఫ్ట్‌వేర్ నియంత్రణలో పనిచేస్తూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఇది రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను కూడా అరికడుతుందని భావిస్తున్నారు.

సాంకేతికత మానవ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఎక్స్‌పెంగ్ చేస్తున్న ఈ ప్రయోగాలు నిదర్శనం. మరో మూడేళ్లలో మనం రోడ్లపై నడిచే కార్ల కంటే ఆకాశంలో ఎగిరే కార్లను, దుకాణాల్లో మనుషుల కంటే రోబోట్లను ఎక్కువగా చూసే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు మన నిజ జీవితం కాబోతోంది..!

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us