AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangeetha mobiles: సంగీత మోబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌

సంగీత మొబైల్స్ తన 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ, "బిగ్ 51 యానివర్సరీ సేల్"ను ప్రారంభించింది. ప్రతి కస్టమర్‌కు రూ.5,001 ప్రయోజనం, 24 నెలల డ్యామేజ్ ప్రొటెక్షన్‌పై 70 శాతం తగ్గింపు, ధర తగ్గితే రూ.10,000 వరకు కాష్‌బ్యాక్, బైబ్యాక్ ఆఫర్లు అందిస్తోంది.

Sangeetha mobiles: సంగీత మోబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌
Sangeetha Moblies
SN Pasha
|

Updated on: May 31, 2025 | 5:07 PM

Share

భారతదేశంలో ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ అయిన సంగీత‌ మోబైల్స్ 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, ఉచిత బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు, అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.

బిగ్‌51 యానివ‌ర్స‌రీ సేల్ పేరుతో ఈ సేల్‌ను ప్ర‌క‌టించింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల‌కుపైగా యూజ‌ర్ల మ‌న‌సుల‌ను గెలుచుకున్న బ్రాండ్‌గా నిలిచిన సంగీత మొబైల్స్ మే 31వ తేదీ నుంచి జూలై 6 వరకు దేశవ్యాప్తంగా 800కుపైగా స్టోర్లలో ఈ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది.

స్టోర్‌లోకి అడుగు పెడితే చాలు

51వ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సంగీత మొబైల్స్ క‌స్ట‌మ‌ర్ల‌కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మీరు సంగీత స్టోర్‌లోకి అడుగు పెడితే చాలు రూ. 5001 విలువైన బ‌హుమ‌తులు మీకు దక్కుతాయి. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఈ ప‌థ‌కాన్ని అందిస్తారు.

24 నెలల డ్యామేజ్ ప్రొటెక్షన్

సంగీత మొబైల్స్‌లో కొనుగోలు చేసిన ప్రొడ‌క్ట్‌పై మీరు 2 ఏళ్ల డామేజ్ కవరేజ్ ఉచితంగా పొందుతారు. మీ ఫోన్ ప్రమాదవశాత్తూ పగిలినా, స్క్రీన్ బ్రేక్ అయినా రీప్లేస్‌మెంట్‌పై 70% వరకు తగ్గింపు లభిస్తుంది.

రూ. 10,000 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్

ఒక‌వేళ మీరు కొనుగోలు చేసిన మొబైల్ ధర 30 రోజుల్లో త‌గ్తితే మీకు రూ. 10,000 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కాబ‌ట్టి ప్రొడ‌క్ట్‌ను త‌క్కువ ధ‌రకే సొంతం చేసుకోవ‌చ్చు.

గ్యారంటీ బైబ్యాక్

మీ ఫోన్ మార్చాలనుకున్నప్పుడు ఎలాంటి సందేహం లేకుండా గ్యారంటీడ్ బైబ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఇది సంగీత మొబైల్స్ మాత్ర‌మే అందిస్తున్న బెస్ట్ ఆఫ‌ర్‌.

ఉచితంగా 50GB AI క్లౌడ్ స్టోరేజ్

ప్రతి మొబైల్ కొనుగోలుపై 50GB AI ఆధారిత క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా పొందొచ్చు. దీంతో మీ ఫొటోలు, వీడియోలు, డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. స్టోరేజ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ. 3750 క్యాష్‌బ్యాక్

ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 3750 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో మీరు కొనుగోలు చేసే ప్ర‌తీ వ‌స్తువుపై క‌చ్చిత‌మైన క్యాష్‌బ్యాక్ పొందొచ్చ‌న్నమాట‌.

24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ

జీరో వ‌డ్డీతో 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ అందిస్తున్నారు. మీరు కొనుగోలు చేసిన ప్రొడ‌క్ట్స్‌కు అనుగుణంగా సౌకర్యవంతమైన ఫైనాన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

800కిపైగా స్టోర్ల‌లో సెల‌బ్రేష‌న్

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి దేశంలోని ప్రధాన నగరాల్లోని 800కి పైగా సంగీత స్టోర్‌లో గ్రాండ్ సేల్ జ‌ర‌గ‌నుంది.