ఆరోజున తులసి ఆకులను తెంపుతున్నారా ? అయితే జాగ్రత్త.. తుంచితే ఏమవుతుందో తెలుసా..

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోజూ ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం.. ప్రదక్షిణలు చేయడం వలన పుణ్యం

ఆరోజున తులసి ఆకులను తెంపుతున్నారా ? అయితే జాగ్రత్త.. తుంచితే ఏమవుతుందో తెలుసా..
Tulasi Tree
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2021 | 11:27 AM

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోజూ ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం.. ప్రదక్షిణలు చేయడం వలన పుణ్యం లభిస్తుందని విశ్వాసిస్తుంటారు. అలాగే ఈ తులసి మొక్కలను ఎక్కువగా ఆరాధనలో ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అందుకే తులసిని ఎన్నో వ్యాధుల నియంత్రణలో ఉపయోగిస్తుంటారు. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.  తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు.  ఇంటి ముంగిట్లో తులసి చెట్టు ఉంటే ఇంట్లో సమస్యలు తోలగిపోతాయని చెబుతుంటారు. తులసి మొక్కతో హారి పూజిస్తారు. అలాగే కొంతమంది ఈ తులసి ఆకులను టీలో వేసుకోని తాగుతుంటారు. అయితే ఈ తులసి ఆకులను ఏ తుంచకూడదు.. దాని వల్ల కలిగే పరిణామాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులను ఏరోజున తుంచకూడదు…

తులసి మొక్క ఆకులను ఆదివారం, సూర్యగ్రహణం, అయనాంతం, ద్వాదశి, చంద్రగ్రహణం, సాయంత్రం పూట, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచకూడదు. అలాగే తులసి ఆకులను తూర్పు ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి. ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తుంచకూడదు. అలాగే రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా.. కాళ్ళకు చెప్పులు వేసుకొని తులసి మొక్కను తాకకూడదు. తులసి ఆకును ఒకటిగా తుంచకూడదు.. మూడు ఆకులను కలిపి ఒకేసారి తుంచాలి.

తులసి ఆకులను తుంచే పద్ధతి..

తులసి ఆకులను గోరుతో తుంచడం కానీ, లాగడం కానీ చేయకూడదు. అలాగే వాటిని నోటిలో వేసుకోని నమలకూడదు. తులసి మొక్కను ఈశాన్యాన గాని తూర్పు పక్కన గాని నాటాలి . అటు వైపు సూర్యుడి వెలుగు ఎక్కువ ఉండాలి. తులసి చెట్టును రాధారాణి అవతారంగా కోలుస్తుంటారు. అందుకే స్నానం చేయకుండా తులసి చెట్టును తాకకూడదు. అలా చేస్తే ఆ తులసి చెట్టు పూజించడానికి పనికిరాదు. సాయంత్రం సమయంలో తులసి ఆకులను తుంచితే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగి.. అనారోగ్య సమస్యల భారీన పడతారని అంటుంటారు.

Also Read:

శని అమావాస్య 2021: ఈరోజు ఈ పనులు చేస్తే శని ప్రభావం నుంచి విముక్తి పొంది.. సమస్యలు తొలగిపోతాయి..

మీన సంక్రాంతి 2021: ఈరోజు మీన సంక్రాంతి.. దాని ప్రాముఖ్యత ఈరోజు చేయవలసిన పనులెంటో తెలుసా…

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.