శని అమావాస్య 2021: ఈరోజు ఈ పనులు చేస్తే శని ప్రభావం నుంచి విముక్తి పొంది.. సమస్యలు తొలగిపోతాయి..

Shani Amavasya 2021: హిందూ సంప్రదాయంలో ఫాల్గున మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో అమావాస్య

శని అమావాస్య 2021: ఈరోజు ఈ పనులు చేస్తే శని ప్రభావం నుంచి విముక్తి పొంది.. సమస్యలు తొలగిపోతాయి..
Shani Amavasya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 13, 2021 | 9:27 AM

Shani Amavasya 2021: హిందూ సంప్రదాయంలో ఫాల్గున మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో అమావాస్య శనివారం వచ్చింది. దీంతో ఈ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈరోజు శనిదేవుని ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శనివారం రోజున శని ప్రభావంతో ఇబ్బందిపడుతున్నవారు ప్రత్యేక పూజలు చేయడంవలన సమస్యలు తొలగిపోతాయి. అలాగే శనిదోష, శని సడేసతి, శని దయ లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజున చేయాల్సిన కొన్ని నివారణ చర్యలు చేపట్టడం వలన సమస్యలను తొలగిపోతాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

ఈరోజు చేయావలసిన పనులు..

* పీపాల్ చెట్టును పూజించడం వలన శనిదేవుడి దృష్టి నుంచి విముక్తి పొందవచ్చు. ఆవనూనేతో పీపాల్ చెట్టు దగ్గర దీపం పెట్టడం వలన శని చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుంది. * ఈరోజున సిందూరం, మల్లె నూనె దీపం పెట్టి.. హనుమంతుడికి ఎర్రటి వస్త్రాన్ని ఇవ్వాలి. ఈరోజున ఆంజనేయుడిని పూజించడంవలన శని ప్రభావం తప్పుతుంది. * జమ్మీ చెట్టు శనిదేవుడికి చాలా ప్రీతికరమైనది. ఈరోజున ఈ చెట్టును పూజించడంవలన.. దీని దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈరోజున ఈ చెట్టుకు నల్లటి వస్త్రాన్ని కట్టి పూజిస్తే.. ప్రయోజనం ఉంటుంది. * ఈ రోజున ఉదయాన్నే పీపాల్ చెట్టుకు నీళ్ళను పోయాలి. అలాగే ఆ చెట్టు చూట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఆ తర్వాత ఆంజనేయుడి ముంది చతుర్ముఖ దీపాన్ని వెలిగించి.. ఈ చెట్టు కింద హనుమాన్ చాలీసాను పఠనం చేయాలి. * ఈరోజున ఆవనూనేతో చేసిన వంటలను నల్ల ఆవులు, నల్ల కుక్కల వంటికి తినిపించాలి. రోటీలలో ఆవ నూనే కలిపి కూడా పెట్టవచ్చు. ఇలా చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. * శనిఅమావాస్యకు ముందు రోజు రాత్రి 800 గ్రాముల నల్ల నువ్వులను నానబెట్టాలి. షానైశ్వరి అమావాస్య రోజున బెల్లంలో చూర్ణం చేసి.. నల్ల గుర్రానికి ఇవ్వడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఎనిమిది శనివారాలు చేయడం వలన శని బాధల నుంచి ఉపశమనం పొందుతారు. * పీపాల్ చెట్టు 11 ఆకులను కడిగిన తర్వాతా వాటిపై గంధపు చెక్కతో శ్రీ రాం అంటూ రాయాలి. వాటిని ఆంజనేయుడికి సమర్పించాలి. ఆ ఆకులను హనుమంతుడి పాదాల వద్ద మాత్రం ఉంచకూడదు. దండను తయారు చేసి ఆంజనేయుడి మేడలో వేయడం మంచిది.

Also Read:

Maha Shivaratri 2021: మహాశివరాత్రి విశిష్టత.. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పిన శివరాత్రి కథ..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.