నవరాత్రి.. ఈ రెండు పదాల సమ్మేళనంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో నవ అంటే తొమ్మిది అని అర్ధం.. అంటే తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో దుర్గామాత తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబర్ 7న ప్రారంభం కాగా.. అక్టోబర్ 15న విజయదశమి. అమ్మవారిని ప్రతీ రోజూ ఒక్కో రంగు వస్త్రంతో భక్తులు పూజిస్తారు. ఇక ఈ నవరాత్రుల సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులు ఏంటో చూసేద్దాం పదండి..
నవరాత్రుల సమయంలో ఏమి చేయాలి.?
* నవరాత్రులలో బ్రహ్మచర్యాన్ని అనుసరించండి.
* నవరాత్రి సమయంలో వెల్లుల్లి-ఉల్లిపాయను తినవద్దు.
* సాధారణ ఉప్పుకు బదులుగా రాతిఉప్పును ఉపయోగించండి.
* సూర్యోదయానికి ముందు నిద్రలేవండి, అలాగే పగటిపూట నిద్రపోవద్దు.
* పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
* నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండే భక్తులు నేలపై పడుకోవాలి.
* నవరాత్రి చివరి రోజున, పెళ్లికాని అమ్మాయిలను తప్పనిసరిగా ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టాలి.
* నవరాత్రి రోజులలో, ప్రతి వ్యక్తి ముఖ్యంగా ఉపవాసం ఉన్న వ్యక్తి కోపం, అత్యాశ వంటి చెడు ధోరణులను వదులుకోవాలి.
* నవరాత్రి చివరి రోజున, దుర్గామాతను పూర్తి భక్తితో నిమజ్జనం చేయండి.
నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయకూడదు
* గడ్డం-మీసం, జుట్టు మొదలైనవి నవరాత్రి సమయంలో కత్తిరించకూడదు.
* అఖండ జ్యోతిని వెలిగించేవారు తమ ఇంటిని తొమ్మిది రోజులు ఖాళీగా ఉంచకూడదు.
* పూజ సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్, చెప్పులు-బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు.
* నల్ల రంగు దుస్తులను ధరించవద్దు.
* మాంసం, చేపలు, మద్యం, గుట్కా, సిగరెట్లు మొదలైనవి తీసుకోకూడదు.
* నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరితోనూ అబద్దం చెప్పొద్దు.
* తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి.. మరణించినవారిని చూడటానికి వెళ్లకూడదు.
* నవరాత్రి సమయంలో శారీరక సంబంధాలు మానుకోండి.
దుర్గామాతకు నైవేద్యంగా ఏం పెట్టాలి.? ఎలాంటి ఫలితాలు వస్తాయి.!
* జాజికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల కీర్తి లభిస్తుంది.
* ఎండుద్రాక్ష ద్వారా పనులు సక్రమంగా పూర్తవుతాయి.
* ఉసిరికాయను నైవేద్యంగా పెడితే ఎలప్పుడూ సంతోషమే.
* గోధుమలతో నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం.
* ఖీర్ కుటుంబ వృద్ధిని ఇస్తుంది, చంపా పువ్వులు సంపద, ఆనందాన్ని తెస్తాయి.
* కమలం గౌరవాన్ని అందిస్తుంది.
Read Also: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్
ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?