Sita Temple: త్వరలో శ్రీలంకలోని సీతాదేవి ఆలయం ప్రారంభం.. భారత్ నుంచి ప్రత్యేక కానుకలు

|

May 13, 2024 | 5:10 PM

సీతా దేవి దేవస్థానం శ్రీలంకలోని నువారా ఎలియా నుంచి చాలా దూరంలో ఉన్న సీతా ఎలియా గ్రామంలో ఉంది. సీతాదేవి ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు.. లంకకు రాజైన రావణుడు సీతాదేవిని అపహరించి ఈ ప్రదేశంలో బంధించాడని ప్రతీతి. స్థానిక నమ్మకం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించి, అశోక్ వాటికగా పిలువబడే ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. సీతాదేవిని రావణుడు ఇక్కడే బంధించాడు. సీతాదేవి తన భర్త శ్రీరాముడిని రక్షించమని ప్రార్థించింది.

Sita Temple: త్వరలో శ్రీలంకలోని సీతాదేవి ఆలయం ప్రారంభం.. భారత్ నుంచి ప్రత్యేక కానుకలు
Sri Lanka Sita Temple
Follow us on

రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకుంది. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో గర్భ గుడిలో బాల రాముడు కొలువుదీరాడు. అయితే ఇప్పుడు సీతాదేవి ఆలయం వంతు వచ్చింది. శ్రీలంకలోని సీతా ఎలియా గ్రామంలో సీతా ఆలయం ఉంది. ఈ సీతాదేవి ఆలయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన శ్రీ రవిశంకర్ గురూజీ పునరుద్ధరించారు. పునరుద్ధరించిన ఆలయాన్ని మే 19 ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతో ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనాద్రి కొండ నుంచి సీతాదేవికి భారీగా కానుకలు పంపించారు. ఆంజనేయ విగ్రహం, నీరు, మట్టి, పట్టు చీర సీతాదేవి ఆలయానికి కానుకలుగా పంపించారు.

సీతాదేవి ఆలయ చరిత్ర

సీతా దేవి దేవస్థానం శ్రీలంకలోని నువారా ఎలియా నుంచి చాలా దూరంలో ఉన్న సీతా ఎలియా గ్రామంలో ఉంది. సీతాదేవి ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు.. లంకకు రాజైన రావణుడు సీతాదేవిని అపహరించి ఈ ప్రదేశంలో బంధించాడని ప్రతీతి. స్థానిక నమ్మకం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించి, అశోక్ వాటికగా పిలువబడే ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. సీతాదేవిని రావణుడు ఇక్కడే బంధించాడు. సీతాదేవి తన భర్త శ్రీరాముడిని రక్షించమని ప్రార్థించింది.

ఈ ఆలయంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. హనుమంతుని పాదముద్రలున్న ఒక శిల ఉంది. సీతా దేవి ఆలయం సీతా నది పక్కనే ఉంది. సీతాదేవి ఇప్పటికీ ఈ నదిలో స్నానం చేస్తుందని.. ఆమె రోజూ ప్రార్థనలు చేస్తుందని నమ్ముతారు. ఇది చరిత్ర, ఆధ్యాత్మికత మత ప్రాధాన్యత ఉన్న ప్రదేశం.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఆలయం ప్రత్యేకంగా సీతాదేవికి అంకితం చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక ఆలయం. ఇది భారతదేశం, శ్రీలంక మధ్య సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను వ్యక్తం చేస్తుంది. అంతేకాదు శ్రీలంకలో ఉన్న రామాయణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి.

చాలా మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడ సందర్శిస్తారు. సీతా జయంతి, శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి, రామాయణానికి సంబంధించిన వివిధ పండుగలు, కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు