Ganesha Birth Place: గణపతి జన్మించిన గ్రామం.. నేటికీ సైన్స్ చేదించలేని సరస్సు రహస్యం.. ఎక్కడంటే..

|

Sep 09, 2024 | 9:35 AM

గణపతి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న అందమైన సరస్సు దోడితాల్ సమీపంలో జన్మించాడు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,310 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయం గణేశుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న సరస్సుకు సంబంధించి ఒక పెద్ద రహస్యం కూడా ఉంది.

Ganesha Birth Place: గణపతి జన్మించిన గ్రామం.. నేటికీ సైన్స్ చేదించలేని సరస్సు రహస్యం.. ఎక్కడంటే..
Lord Ganesha Birth Place
Follow us on

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధి నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజున విఘ్నాలకధిపతి గణేశుడు అవతరించినట్లు నమ్మకం. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు తమ ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు గణేశుడికి ఇష్టమైన వస్తువులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

గణేశుడు ఎలా జన్మించాడంటే

శివపురాణంలో వినాయకుని జననం గురించి ఒక కథ ఉంది. ఈ కథనం ప్రకారం పార్వతిదేవి ఒకసారి తన శరీరంపై మురికిని తొలగించుకోవడానికి నలుగు, పసుపుని పెట్టుకుంది. దీని తరువాత పు ముద్దను తన చేతిలోకి తీసుకుని దానితో ఒక బొమ్మను తయారు చేసింది. ఆపై ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ఇలా గణపతి దేవుడు జన్మించాడు.

ఎక్కడ జన్మించాడంటే

గణపతి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న అందమైన సరస్సు దోడితాల్ సమీపంలో జన్మించాడు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,310 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయం గణేశుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న సరస్సుకు సంబంధించి ఒక పెద్ద రహస్యం కూడా ఉంది. ఇక్కడ గణేశుడు తన తల్లి పార్వతితో కలిసి కొలువు దీరాడు. ఇక్కడ పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో కొలువై ఉంది. అన్నపూర్ణ దేవిని, గణేశుడిని పూజించేందుకు భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నేటికీ గణపతి దోడితాల్‌లోని అన్నపూర్ణ ఆలయంలో తన తల్లితో కలసి కొలువై ఉన్నాడని స్థానికుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

దోడితాల్ సరస్సు రహస్యం

దోడితాల్ షట్కోణ సరస్సు ఒకటి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీని లోతు ఎంత ఉందో ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేకపోయారు. చాలా సార్లు చాలా మంది శాస్త్రవేత్తలు సరస్సు లోతును కొలవడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దోడితాల్ సరస్సు లోతు ఇప్పటికీ రహస్యంగానే ఉంది.

దోడితాల్ సరస్సును భాగీరథికి అనుసంధానం చేయడం

దోడితాల్ ఉత్తరకాశీ జిల్లాలోని మంచి మంచినీటి పర్వత సరస్సు. ఇది 3,657 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ జన్మించిన అస్సీ గంగా నది భాగీరథి నదిలో కలిసిపోతుంది. ఈ రెండు నదుల సంగమం గంగోరిలో జరుగుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి