House Temple Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో ఏర్పాటు చేసిన గుడి విషయంలో ఈ ఐదు తప్పులు అస్సలు చేయొద్దు..
House Temple Vastu: సనాతన సంప్రదాయంలో భగవంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి హిందువు తమ ఇంట్లో దేవుడిని ప్రతిష్టించి పూజిస్తారు.
House Temple Vastu: సనాతన సంప్రదాయంలో భగవంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి హిందువు తమ ఇంట్లో దేవుడిని ప్రతిష్టించి పూజిస్తారు. దేవుళ్ల ప్రతిష్టాపన కోసం ప్రత్యేకంగా ఒక కోవెలను ఏర్పాటు చేస్తారు. ఆధ్యాత్మిక దృక్కోణంలో ఇంట్లో, ప్రార్థనా స్థలంలో నిర్మించబడిన దేవాలయం సానుకూల శక్తికి కేంద్రంగా ఉంటుంది. తద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పొందుతాము. ఆధ్యాత్మిక బలాన్ని, శాంతిని అందించే ఈ ప్రార్థనా స్థలాన్ని ఎల్లప్పుడూ వాస్తు నియమాల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం వస్తుంది. ఇంట్లో ఏర్పాటు చేసే ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. నిర్మాణ స్థలం అనుగుణంగా ఆరాధన ఎల్లప్పుడూ ఈశాన్యం, ఉత్తర దిశలో ఆలయాన్ని నెలకొల్పి దేవతారాధన చేయాలి. మీ ముఖం తూర్పు వైపున ఉండేలా దేవతారాధన చేయాలి. 2. ఇంట్లో నిర్మించే గుడి ఎత్తు దాని వెడల్పు కంటే రెండింతలు అధికంగా ఉండాలి. పూజ గదిలో ఏర్పాటు చేసిన దేవుని విగ్రహాలు మీ హృదయానికి సమానమైన ఎత్తులో ఉండాలి. ఇంటి గుడిలో పెద్ద విగ్రహాలు ఎప్పుడూ పెట్టకూడదు. వాస్తు ప్రకారం.. పూజా మందిరంలో తొమ్మి వేళ్ల వరకు ఉన్న విగ్రహాలను శుభప్రదంగా భావిస్తారు. 3. విరిగిన విగ్రహాన్ని పూజగదిలో ఎప్పుడూ ఉంచకూడదు. అదేవిధంగా, ప్రార్థనా మందిరం ఏదైనా దేవత, దేవుడు రంగులేని చిత్రాన్ని చింపివేయడం కానీ, పడేయటం కానీ చేయకూడదు. అలాంటి ఫోటో లేదా విగ్రహాన్ని పవిత్ర ప్రదేశానికి తీసుకెళ్లి పాతిపెట్టాలి. 4. పూజ గదిలో మరణించిన వారి ఫోటోను ఎప్పుడూ ఉంచకూడదు. 5. ఇంట్లో నిర్మించే ఆలయానికి కాంతి, శుభం కలగలిసిన రంగులు మాత్రమే వేయాలి. లేత పసుపు, నీలం, నారింజ రంగులను వేయొచ్చు. ఆలయానికి ప్రకాశవంతమైన రంగులు వేయొద్దు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. నలుపు రంగు పొరపాటున కూడా వేయకూడదు. 6. వాస్తు ప్రకారం.. పూజగదిని మెట్ల క్రింద గానీ, టాయిలెట్ పక్కన గానీ నిర్మించకూడదు. అలా చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, వాస్తు విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు)
Also read:
Syringe in Liquor: బీరు ప్రియులకు షాకింగ్ న్యూస్.. తాగేటప్పుడు చూసి తాగండి..
Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..