Syringe in Liquor: బీరు ప్రియులకు షాకింగ్ న్యూస్.. తాగేటప్పుడు చూసి తాగండి..
సండే అని మందుతో చిందులేద్దామని అనుకున్న ఆ మందు బాబుకు బిగ్ షాక్ తగిలింది. వైన్ షాప్ నుంచి తెచ్చుకున్న అతనికి చుక్కలు కనిపించాయి. బాటిల్ ఓపెన్ చేయకుండానే..
సండే అని మందుతో చిందులేద్దామని అనుకున్న ఆ మందు బాబుకు బిగ్ షాక్ తగిలింది. వైన్ షాప్ నుంచి తెచ్చుకున్న మందు బాటిల్ అతనికి చుక్కలు చూపించింది. బాటిల్ ఓపెన్ చేయకుండానే మత్తు నశాలానికి ఎక్కింది. ఎందకంటే కొన్న బీరు బాటిల్‌లో మందుతోపాటు మరొకటి కనిపించింది. అది చూసిన మద్యం బాబుకు దిమ్మతిరిగింది. తర్వాత నిశీతంగా గమనిస్తే అర్థమయ్యింది. అందులో ఉన్న ఓ సిరంజీ చూసి షాక్ అయ్యాడు. అప్పటి వరకు ఎక్కిన మత్తు అంతా దిగిపోయింది. ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకొని మరీ కూర్చున్నాడు.
అది చూసిన మందుబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో మందుబాబులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా కల్తీ మందును చూస్తుంటాం.. చెత్త బ్రాండ్‌లను చూస్తుంటాం.. అయితే ఇలా మంచి బ్రాండ్ మందులో ఇలా సిరంజీ ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు.
రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో బీరు సేవించి వెళ్దాం అనుకున్న వ్యక్తికి దిమ్మతిరిగిపోయింది. ఇది హైదారాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్ షాప్‌లో ఇది వెలుగు చూసింది. కాప్రా మహంకాళి బారులో కొనుగోలు చేసిన బాటిల్‌లో ఈ సిరంజీ కనిపించింది.బీరు బాటిల్‌లో సిరంజీ కనిపించడంతో కంగుతిన్న వ్యక్తి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..