Vastu Tips: ఇంట్లోని పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా… కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే..
సనాతన ధర్మంలో పూజకి విశేషమైన స్థానం ఉంది. హిందువులు రోజూ పూజ చేయడం తమ దినచర్యలో భాగంగా భావిస్తారు. ఇందు కోసం తమ ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని రోజూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారు. ఇలా చేయడం వలన దేవుళ్ళ ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయని నమ్మకం. పూజ గదిలో కొన్ని పూజాద్రవ్యలతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా పెడతారు. అయితే కొన్ని రకాల వస్తువులు పూజ గదిలో ఉండడం వలన ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు ఇంట్లోని పూజ గదిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం.

ఇంట్లో పూజ గది లేదా పూజ చేసే ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఆలయంలో కొన్ని వస్తువులను ఉంచడం అశుభం. చాలా సార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే అలాంటి వస్తువులను ఆలయంలో ఉంచుతారు. ఇవి ఇంట్లో సుఖ సంతోషాలను హరింప జేసేవిగా వాస్తు శాస్త్రం పేర్కొంది. ఈ రోజు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..
కొన్ని వస్తువులను ఇంట్లోని పూజగదిలో లేదా పూజ చేసే చోట ఉంచకూడదు..ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలగవచ్చు.
ఇంటి పూజా గదిలో ఏమి ఉంచకూడదు?
- విరిగిన విగ్రహాలు: విరిగిన దేవుళ్ళు, దేవతల విగ్రహాలను లేదా చిగిరిన, పగిలిన చిత్రాలను ఇంటి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి.
- ఎండిన పువ్వులు: ఎండిన పువ్వులు లేదా దండలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకంటే అవి ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడతాయి .
- చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు: వాస్తు ప్రకారం చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా చిత్రాలను కూడా పూజ చేసే ప్రాంతంలో ఉంచకూడదు.
- పూర్వీకుల చిత్రాలు: వాస్తు శాస్త్రం ప్రకారం, పూర్వీకుల చిత్రాలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు.
- పదునైన వస్తువులు: కత్తెర లేదా ఇతర పదునైన వస్తువులను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు, ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.
- అగ్గిపుల్లలు : ఇంట్లో గుడిలో అగ్గిపుల్లలు ఉంచడం అశుభం. ఎందుకంటే అగ్గిపుల్లలు ఇంట్లో అశాంతిని, ఇబ్బందులను కలిగిస్తాయి.
- ఒకటి కంటే ఎక్కువ శంఖాలు: ఇంటి పూజ చేసే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకుండా ఉండాలి, ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది.
- దేవతలు, దేవతల భయంకరమైన రూపాలు: నటరాజ స్వామి లేదా కాలభైరవుడు వంటి శివుని భయంకరమైన అవతారాలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇంటి పూజ గదిలో ఉంచకూడదు.
- ఎక్కువ విగ్రహాలు: ఒకే దేవుడు లేదా దేవతకి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు .
- చీపురు : పొరపాటున కూడా ఇంట్లోని పూజ గదిలో చీపురు పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








