AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోని 3 ప్రదేశాల్లో స్థిరపడండి ఫ్రీ ఇల్లు, డబ్బులు ఇస్తామంటూ బంపర్ ఆఫర్.. ఎందుకంటే

ప్రస్తుతం ప్రజల ఆలోచనలు, జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా లేక మూగబోతున్నాయి. వివిధ కారణాలతో పల్లెలు పట్టణాల బాట పడుతున్నాయి. దీంతో చిన్న చిన్న గ్రామాలలో జనాభా ఖాళీ అయిపోతుంది. ఈ సమస్యని ప్రపంచంలో అనేక దేశాల్లోని గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్‌, ఇటలీ, గ్రీస్ దేశాల్లోని కొన్ని గ్రామాల్లో జనాభా స్థిరపడితే డబ్బులను ప్రోత్సాహకాలుగా అందిస్తున్నాయి.

ప్రపంచంలోని 3 ప్రదేశాల్లో స్థిరపడండి ఫ్రీ ఇల్లు, డబ్బులు ఇస్తామంటూ బంపర్ ఆఫర్.. ఎందుకంటే
Viral News
Surya Kala
|

Updated on: Jul 08, 2025 | 6:16 PM

Share

మీ బ్యాగులు సర్దుకుని, కొత్త దేశానికి వెళ్లి అక్కడ డబ్బు సంపాదించడం గురించి ఊహించుకోండి. కలలా అనిపిస్తోంది కదా? కొన్ని దేశాలు ఈ కలను నిజం చేస్తున్నాయి. తమ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లేరు.. ఇక్కడకు వచ్చి నివసించ మంటూ ప్రజలను అనేక దేశాలు పిలుస్తూనే ఉన్నాయి. పైగా డబ్బులను కూడా ఇస్తూ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. కొత్త నివాసితులను ఆకర్షిస్తున్నాయి. కంటెంట్ సృష్టికర్త, ఆర్థిక నిపుణుడు కాస్పర్ ఒపాలా ఇప్పుడు ఈ అద్భుతమైన ఆఫర్ ని స్తున్న దేశాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని మూడు ప్రదేశాల్లో పర్యాటకులు శాశ్వతంగా అక్కడ నివసించేందుకు డబ్బు చెల్లిస్తున్నాయని చెప్పారు. స్విట్జర్లాండ్‌, ఇటలీ, గ్రీస్ దేశాలు ఈ బంపర్ ఆఫర్ ని ప్రకటించాయి. గ్రీస్‌లోని యాంటికిథెరా ద్వీపం, స్విట్జర్లాండ్‌లోని అల్బినెన్, ఇటలీలోని ప్రెసిస్.

ప్రెసిచే, ఇటలీ

ప్రెసిచే కౌన్సిలర్ ఆల్ఫ్రెడో పాలీస్ ప్రకారం ఇటలీలోని ప్రసిద్ధ నగరంప్రెసిచేలోని చారిత్రాత్మక ప్రాంతంలో ఎక్కువగా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఇళ్లలో ప్రజలు నివసించేలా చేయాలనీ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఈ ప్రెసిచేలో స్థిరపడే ప్రజలకు 30,000 డాలర్ల సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని వారికి రెండు సార్లు అందజేయనున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

అంటికిథెరా ద్వీపం, గ్రీస్

తెల్లని భవనాలు, సహజమైన సముద్ర దృశ్యాలు, గుహలు, కొండలు , అందమైన దృశ్యాలతో నిండిన ఈ బీచ్ పట్టణం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ స్థిరపడటానికి ప్రజలకు డబ్బు ఇస్తోంది. ఐదు కుటుంబాలు యాంటికిథెరాకు మకాం మార్చడానికి ఆర్థిక సహాయం పొందుతాయని ది ట్రావెల్ పేర్కొంది. ఇక్కడ నివసించేందుకు ఉచితంగా ఇల్లు కూడా అందించబడుతుంది. అయితే బేకింగ్ లేదా ఫిషింగ్ వంటి నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి నెలా $600 ఇవ్వబడుతుంది. దీనికి కారణం ఈ ద్వీపంలో జనాభాను పెంచడం, ఆర్థిక వ్యవస్థ బలపరచడం. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది.

అల్బినెన్, స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్‌లోని ఈ సుందరమైన గ్రామీణ ప్రాంతానికి మారడం ద్వారా పరిపూర్ణ స్విస్ ఆనందాన్ని అనుభవించావచ్చు. ట్రావెలర్ 365 ప్రకారం అల్బినెన్‌కు నలుగురు కుటుంబ సభ్యులున్న వారికీ దాదాపు మన దేశ కరెన్సీ ప్రకారం 50 లక్షల రూపాయలను అందిస్తుంది. ఇక్కడ నివసించే జనాభాని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యని అని చెబుతున్నారు.ఈ ఆర్థిక ప్రోత్సాహకం ముఖ్యంగా యువ కుటుంబాలు లేదా జంటలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..