AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మపుత్ర నదిలో కనిపించిన అరుదైన కొత్త చేప జాతి.. ప్రత్యేకతలు తెలిస్తే..

భారతదేశంలోని అనేక ముఖ్యమైన నదుల్లో బ్రహ్మపుత్ర నది కూడా ఒకటి. టిబెట్ - అరుణాచల్ ప్రదేశ్ - అస్సాం - బంగ్లాదేశ్ గుండా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది బ్రహ్మపుత్రా నది. ఈ నది అనేక రకాల జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. ఈ న‌దిలో దాదాపు 150 కి పైగా చేపల రకాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. తాజాగా అస్సాంలోని దిబ్రుగఢ్ సమీపంలోని బ్రహ్మపుత్రలో మ‌రో కొత్త జాతి చేప‌ను గుర్తించారు. జల జీవవైవిధ్యంపై జరుగుతున్న సర్వేలో గుర్తించబడిన ఈ చేప ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బ్రహ్మపుత్ర నదిలో కనిపించిన అరుదైన కొత్త చేప జాతి.. ప్రత్యేకతలు తెలిస్తే..
Rrare New Fish
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2025 | 7:23 PM

Share

భారతదేశంలోని అనేక ముఖ్యమైన నదుల్లో బ్రహ్మపుత్ర నది కూడా ఒకటి. టిబెట్ – అరుణాచల్ ప్రదేశ్ – అస్సాం – బంగ్లాదేశ్ గుండా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది బ్రహ్మపుత్రా నది. ఈ నది అనేక రకాల జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. ఈ న‌దిలో దాదాపు 150 కి పైగా చేపల రకాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. తాజాగా అస్సాంలోని దిబ్రుగఢ్ సమీపంలోని బ్రహ్మపుత్రలో మ‌రో కొత్త జాతి చేప‌ను గుర్తించారు. జల జీవవైవిధ్యంపై జరుగుతున్న సర్వేలో గుర్తించబడిన ఈ చేప ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బ్రహ్మపుత్ర నదీ జలాల్లో శాస్త్రవేత్తలు పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే కొత్త చేపను కనుగొన్నారు. ఇది సైప్రినిడ్ జాతికి చెందిన చిన్న చేప. తోకపై నల్ల మచ్చ, అసంపూర్ణ లేటరల్ లైన్, ప్రత్యేక పొలుసుల అమరిక ఈ చేప ప్రత్యేక లక్షణాలు. పైభాగంలోని రెక్కకు, లేట‌ర‌ల్ లైన్ కు మధ్యలో 4 పొలుసుల వరసలు, అదేవిధంగా కింది రెక్కకు, లేట‌ర‌ల్ లైన్ కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు క్రమ పద్ధతిలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అనేక ఇతర జాతుల్లో కనిపించే నోటి దగ్గర మీసాల లాంటి నిర్మాణాలు, హ్యూమరల్ మార్క్ ఈ చేప‌కు కనిపించదని చెప్పారు.

బీహార్‌కు చెందిన దిబ్రూగఢ్ ప్రాంతంలో కనుగొనబడిన ఈ చేప బ్రహ్మపుత్ర నది జీవవైవిధ్య సమృద్ధిని స్పష్టంగా చూపుతోంది. నదీ పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'