తెలుగు క్యాలెండర్ లో మొదటి రోజుని ఉగాదిగా తెలుగు వారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మ సృష్టిని మొదలు పెట్టిన రోజు యుగానికి ఆది ఉగాదిగా భావించి చైత్ర మాసం పాడ్యమి రోజుని తెలుగు వారంతా గొప్పగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అన్ని పండగలు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే.. ఒక్క మకర సంక్రాంతి మినహా.. ఈ నేపథ్యంలో మనసుకు అధిపతి అయిన చాంద్రమానాన్ని అనుసరించి ప్రకృతిలో మార్పు కారణంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది.
ఉగాది అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్పతనం అంతా ఉగాది పచ్చడి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయాణాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ పండుగ ..కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు.
కొత్త సహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, ఆనందవిషాదాలను సమన్వయంతో, సానుకూల దృక్పధంతో స్వీకరించాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి. షడ్రుచులు కలయిక వేప పువ్వు పచ్చడి. ఈ షడ్రుచుల పచ్చడిని తినడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడి మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. తీపి సుఖసంతోషాలను, పులుపు బాధలను, ఒగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది.
జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం.
ఒకటిన్నర కప్పు నీరు తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న వేప పువ్వులు, కొత్త చింత పండు గుజ్జు, బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు, తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి వేసి కలపాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు