చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి సనాతన సంప్రదాయంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగువారి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం 22 మార్చి 2022.. బుధవారం నుంచి ప్రారంభం కానుంది. హిందూమతంలో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రత్యేక పూజా పద్ధతులు, నియమాలు నిర్దేశించబడ్డాయి, వీటిని అనుసరిస్తే.. ఏడాది ఇంట్లో సుఖ , సంతోషాలు , అదృష్టం ఉంటాయని విశ్వాసం. కొత్త సంవత్సరానికి సంబంధించిన సంప్రదాయాలు, నియమాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
తొమ్మిది గ్రహాలకు రాజుగా పిలువబడే సూర్యుడు హిందూ మతంలో ఆదిదేవుడిగా పూజలను అందుకుంటాడు. ఈ నేపథ్యంలో తెలుగు సంవత్సరాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానమాచరించాలి. ధ్యానం చేసిన అనంతరం రాగి పాత్రతో నీటిని తీసుకుని ఉదయిస్తున్న సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మూడుసార్లు పఠించాలి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి ఏడాది పొడవునా సూర్యభగవానుడు ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం. జీవితంలో అదృష్టం, ఆరోగ్యం పొందుతాడని విశ్వాసం. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున విఘ్నలకధిపతి గణేశుడిని పూజించండి. వేపపువ్వు పచ్చడిని నైవేద్యంగా సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)