AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. కళ్యాణం ఎప్పుడంటే..

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయరామారావు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. కళ్యాణం ఎప్పుడంటే..
Ontimitta Temple
Sudhir Chappidi
| Edited By: Srikar T|

Updated on: Mar 26, 2024 | 6:09 PM

Share

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయరామారావు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో కలసి క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏకశిలా నగరం ఒంటిమిట్టలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామారావు, టిటిడి జె ఈ ఓ వీరబ్రహ్మం తెలిపారు.

ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

  • 16 అంకురార్పణం
  • 17న ధ్వజారోహణ,
  • 18న స్వామి వేణు గాన అలంకారము
  • 19న వటపత్ర సాయి అలంకారం
  • 20న నవనీత కృష్ణా అలంకారము
  • 21న మోహిని అలంకారము
  • 22న శివధనుర్భంగాలంకారము

అలాగే అత్యంత విశిష్ఠమైన స్వామి కళ్యాణం ఏప్రిల్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలతో పాటు కోదండరామ స్వామి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైనన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, భక్తులను అనుమతించాల్సిన విధానం, తాగునీరు, అన్నప్రసాదాల వితరణ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. వీటితో పాటు పలు ఆధ్యాత్మిక భావనను ఉట్టిపడేలా పలు కళాఖండాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..