AV Ramana Deekshitulu : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు
AV Ramana Deekshitulu called on AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులు కలిశారు. కొంచెం సేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంప్..
AV Ramana Deekshitulu called on AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులు కలిశారు. కొంచెం సేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రమణదీక్షితులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇటీవలే టీడీపీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు మరోసారి బాధ్యతలు అందుకున్న నేపథ్యంలో సీఎంను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తిరిగి తనను తిరుమల శ్రీవారి ప్రధానార్చకునిగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, సీఎంను సాక్షాత్తూ విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు.. విష్ణుమూర్తిలా జగన్ ధర్మాన్ని రక్షిస్తున్నారని కితాబిచ్చారు.
పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో, రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ సీఎం జగన్ కు దీక్షితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ను శాలువాతో సత్కరించిన రమణదీక్షితులు, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇతర అర్చకులు కూడా సీఎంను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని దీక్షితులు వెల్లడించారు.
Read also : COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సంచలన ఆదేశాలు