AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లపై కీలక ప్రకటన చేసిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి సర్వదర్శనం కోసం చాలా రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు.

TTD Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లపై కీలక ప్రకటన చేసిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
అటు గత నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 5.32 లక్షల మంది భ‌క్తులు దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2021 | 9:00 PM

Share

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్త జనం పోటీపడుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కొద్దిగా కంట్రోల్‌లోకి వచ్చింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం కల్పిస్తోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం చాలా రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు.

శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శ్రీవారికి జరిగే నవనీత సేవకు తిరుమల ఎస్వీ గోశాలలో సాంప్రదాయ పద్ధతిలో సేకరించిన వెన్నను ఈరోజు ఈవో కేఎస్ జవహర్ రెడ్డితో కలిసి గోశాల నుండి ఊరేగింపుగా వెన్నను తెచ్చి శ్రీవారి ఆలయానికి సమర్పించారు.

శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు నవనీత సేవతో స్వామివారికి సేవలు ప్రారంభమవుతాయన్నారు. స్వామివారి సేవకు వచ్చిన భక్తులే నవనీత సేవ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కలియుగం ఉన్నంతకాలం, స్వామివారి అనుగ్రహం ఉన్నంతకాలం నవనీత సేవ శ్రీవారి ఆలయంలో కొనసాగుతుందని అన్నారు.

అనంతరం తిరుమలలో పర్యావరణం పరిరక్షణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన 35 ఎలక్ట్రిక్ కార్లకు పూజలు నిర్వహించారు. తిరుమలలో పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. మొదటి దశలో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే టీటీడీ అధికారుల కోసం 35 విద్యుత్ కార్లు కొనుగోలు చేసామని అన్నారు.

రెండవ దశలో తిరుమలలో భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రికల్ బస్ లు ఏర్పాటు చేస్తామని, మూడవ దశలో తిరుమలకు యాత్రికులను చేరవేయడానికి ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్డులో 100 ఎలక్ట్రికల్ RTC బస్సులు నడపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని… విద్యుత్ బస్సులు ఏర్పాటుకు టెండర్లను పిలవడం జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..