AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. సర్వదర్శనం టోకెన్లను ఎక్కడెక్కడ ఇవ్వనున్నారంటే..

జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతనిస్తామని .. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమానిస్తామని పేర్కొన్నారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి .

Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. సర్వదర్శనం టోకెన్లను ఎక్కడెక్కడ ఇవ్వనున్నారంటే..
Tirumala
Surya Kala
|

Updated on: Dec 27, 2022 | 9:05 PM

Share

తిరుమల తిరుపతి క్షేత్రంలో  వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై అధికారులుతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమీక్షని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులుకే ప్రాధాన్యత అని చెప్పారు. అంతేకాదు కరోనా వ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కొన్ని సూచనలు చేశారు. భక్తులందరికీ మాస్కులు తప్పనిసరని.. వ్యక్తిగత నియంత్రణ, శానిటైజేషన్ పాటించాలని సుబ్బారెడ్డి కోరారు. అంతేకాదు సర్వదర్శనం భక్తులకు.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా ఏకాదశి దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టోకెన్ల జారీ ప్రక్రియ  జనవరి 1వ తేది నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు భక్తులకు ఆన్‌లైన్‌లో రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేశామని, ఆఫ్‌ లైన్‌లో ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేశామని చెప్పారు.

సర్వదర్శనం భక్తులుకు 4.5 లక్షల టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులుకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు సుబ్బారెడ్డి. డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు చేసినట్లు తెలిపారు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అంటే జననరి 2, 3వ తేదిలలో సిఫార్సు లేఖలను స్వీకరించమని.. ఈ రెండు రోజులు స్వయంగా వీఐపీలు వస్తేనే దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణ రథం ఉరేగింపు, ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతనిస్తామని .. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమానిస్తామని పేర్కొన్నారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి . అంతేకాదు ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదిన సర్వదర్శనం టోకేన్లు జారీ రద్ద చేసినట్లు భక్తులు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి ఏర్పట్లు చేసుకోవాలని సూచించారు. వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు వీలుగా లడ్డూ విక్రయశాలల్లో అదనపు లడ్డూ నిల్వలు, కల్యాణకట్టలో అదనపు సిబ్బందిని నియమించామన్నారు.

సర్వదర్శనానికి కౌంటర్స్ 01-01-2023 న ప్రారంభిస్తారు. 24 గంటలు కౌంటర్స్ తెరిచే ఉంటాయి. టోకెన్స్ లేని వారికి కొండ మీదకి అనుమతిస్తారు కాని వారికి దర్శనం చేసుకునే అవకాశం కల్పించరు.

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు 8 చోట్ల తిరుమలలో 1 ఏర్పాటు..

తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రదేశాలు

1) భూదేవి కాంప్లెక్స్

2) శ్రీనివాసం

3)గోవిందరాజు స్వామి సంత్రం

4) MR పల్లి Z.P.హైస్కూల్

5) మున్సిపల్ ఆఫీసు

6) రామచంద్ర పుష్కరిణి

7) రామానాయుడు స్కూల్

8) జీవకోన Z.P.హైస్కూల్

9) తిరుమల – కౌస్తభం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!