Tirumala Tickets: శ్రీవారి సామాన్య భక్తులకు మరో శుభవార్త.. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు.. ఎప్పటి నుంచంటే..!

Srivari Sarva Darshan Tickets:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Tickets: శ్రీవారి సామాన్య భక్తులకు మరో శుభవార్త.. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు.. ఎప్పటి నుంచంటే..!
Ttd
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2021 | 6:11 PM

Sarva Darshan Tickets: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవల పునఃప్రారంభించిన టీటీడీ.. ఇందుకు సంబంధించి టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. త్వరలో ఆన్‌లైన్‌లోనూ సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. దీనిపై చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని.. నిబంధనలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక నుంచి రోజుకి 8 వేల చొప్పున ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also…  Chilli Farming: మిరప సాగులో కొత్త ఒరవడి.. ఉత్తమ రకాలతో భారీ ఉత్పత్తి.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు..