CM KCR: ఈ నెల 14న యాదాద్రికి సీఎం కేసీఆర్.. యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలన
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి ఈ నెల 11వ తేదీన పరిశీలించిన సంగతి తెలిసిందే. ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు.
శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి: Altcoins: ఆల్ట్‌కాయిన్‌లపై పెట్టుబడి పెడితే బిట్‌కాయన్‌ను మించిన లాభాలు.. ఈ ఏడాది 8000 శాతం రాబడి..
Zomato: ఈ నెల17 నుంచి నిత్యావసరాల సేవలు బంద్.. కీలక ప్రకటన చేసిన జొమాటో