Statue of Equality: మన సమాజంలో శాస్త్రం.. శస్త్రం రెండూ ఉండాలి.. శ్రీరామనగరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

రామానుజాచార్యులవారి విగ్రహ ఏర్పాటుతో భాగ్యనగరం పేరుకు సార్థకత వచ్చిందన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న మనదేశంలో వేల సంవత్సరాల నుంచే సమతా సిద్ధాంతం..

Statue of Equality: మన సమాజంలో శాస్త్రం.. శస్త్రం రెండూ ఉండాలి.. శ్రీరామనగరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
Rss Chief Mohan Bhagwat At Muchintal
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 09, 2022 | 11:45 PM

Statue of Sri Ramanuja: రామానుజాచార్య మిలీనియం వేడుకలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat)పాల్గొన్నారు. ముచ్చింతల్ లోని సమతామూర్తి శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులను దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో ఆయన ప్రసంగిస్తూ.. సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని.. భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయన్నారు. రామానుజాచార్యులవారి విగ్రహ ఏర్పాటుతో భాగ్యనగరం పేరుకు సార్థకత వచ్చిందన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న మనదేశంలో వేల సంవత్సరాల నుంచే సమతా సిద్ధాంతం వినిపిస్తోందని మోహన్ భగవత్ వెల్లడించారు. సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని మనది ఎంతో గొప్ప మాతృభూమి అని ఆయన గుర్తు చేశారు.

హిందూ ధర్మంను దెబ్బతీయలని ప్రయత్నిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారని మోహన్ భగవత్ హెచ్చరించారు. మనకు నష్టం చేయాలని చూస్తే వాళ్లకే దెబ్బ తగులుతుందని అన్నారు. హిందువులే 80 శాతం ఉన్న ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే అని గుర్తుచేశారు. దేశంలో నేడు రామ మందిర నిర్మాణం జరుగుతుంది. వంద కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరుతుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. పరాయి దేశాలు మన ప్రతిభను చూసి అసూయపడుతున్నాయని.. హిందువుల సామర్థ్యంతో ఎవరు పోరాటం చేసేందుకు ముందుకురారని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు. హిందు సమాజం ఎవరితో గొడవ పడదు. ప్రపంచలోనే యువజనం ఉన్నది మన దేశంలోనే కాని ఎందుకు మనం ఇంత కాలం వెనుక పడ్డామో తెలుసుకోవాలన్నారు. మనం అనుసరించే పద్దతులు వేరుగా ఉన్నా మనం భారతీయులం అని గుర్తుంచుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

ఆ ప్రాగణంలో జరిగిన వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. అంతకు ముందు.. సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌కు అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తో ఆశ్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేరుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌తో ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశ అనంతరం అక్కడి నుంచి శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 దివ్య క్షేత్రాలను వారు సందర్శిస్తారు. ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ కూడా శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను సందర్శించారు.

శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. జై శ్రీమన్నారాయణ అంటూ జయజయ ద్వానాలు చేస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి(Sri Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఉదయం ఆరున్నరకే అష్టాష్టరీ మంత్ర పఠనం జరగ్గా.. ఏడున్నరకు పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన జరిగింది. ఇక తొమ్మిది గంటల నుంచి శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం మొదలైంది. ఆ తర్వాత ఉదయం పదింటికి ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణేష్టి సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి. పదిన్నరకు యాగశాలలో విద్యార్ధుల విద్యాభివృద్ధి పెద్దల మనోవికాసానికీ హయగ్రీవపూజ.. ఇవాళ్టి సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు.

ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..