Srisailam: శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. మల్లన్న క్షేత్రంలో అన్యమత ప్రచారం, అన్యమత చిహ్నాల ప్రదర్శన నిషేధం..
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి మాత్రమే కాదు అష్టాదశ అమ్మవారి ఆలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లలో ఉంది. శ్రీగిరి క్షేత్రంలో వెలసిన శివయ్య ఇక్కడ మల్లికార్జునుడుగా అమ్మవారు బ్రమరాంబగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆదిదంపతుల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తాయి. తాజాగా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవాదాయ శాఖ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవదాయశాఖ సరి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను అనుసరించి శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమతచిహ్నాలు ప్రదర్శించడం పూర్తిగా నిషేధం విధించారు. ఈ విషయాన్ని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం ఈఓ మాట్లాడుతూ అన్యమత సూక్తులను, చిహ్నాలను, భోదనలను, అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవని పేర్కొన్నారు.
శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన విరుద్దంగా ప్రవర్తించిన వారిపై చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకొనబడతాయని ఈఓ హెచ్చరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..