AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Temple: ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు

ఎట్టకేలకు భక్తులను కరుణించిన పరమశివుడు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం నేటి నుండి ప్రారంభంకానుంది. భక్తుల కోరిక మేరకు ఉచిత స్పర్స దర్శనాలను దేవస్థానం అధికారులు మళ్ళీ ప్రారంభించారు. రోజుకు 1200 మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది, నూతన టోకెన్ సిస్టం ద్వారా ఉచిత స్పర్శ దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.

Srisailam Temple: ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు
Srisailam Mallanna Temple
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 01, 2025 | 10:11 AM

Share

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల దేవస్థానం ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే ప్రతీ భక్తుడి కోరికకు అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యం పునః ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఉచిత దర్శనం కోసం ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేయబడుతాయన్నారు.

ఈ కంప్యూటరైజుడు టోకన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ టోకన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందనీ ఉచిత స్పర్శదర్శనాన్ని భక్తులను కేవలం ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో ధరించవలసి వస్తుంది భక్తుల రద్దీ కారణంగా మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాలు, శ్రావణ మాసం, కార్తిక మాసంలతో పాటు ప్రభుత్వ సెలవు రోజులలో ఈ ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం