AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డులన్నీ బ్రేక్.. శ్రీశైలం మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం.. కేవలం 16 రోజుల్లోనే..

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.. మల్లన్న 16 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 69 లక్షల 55 వేల 456 రూపాయలు లభించినట్లు శ్రీశైలం మల్లన్న దేవస్థానం ప్రకటించింది. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరిగింది.

రికార్డులన్నీ బ్రేక్.. శ్రీశైలం మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం.. కేవలం 16 రోజుల్లోనే..
Sri Bhramaramba Mallikarjuna Devasthanam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 9:42 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 69 లక్షల 55 వేల 455 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు..

ఈ ఆదాయాన్ని గత 16 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 87 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 5 కేజీల 850 గ్రాములు లభించగా.. నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు 885, యూఏఈ దిర్హమ్స్ 105, యూకే పౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు 2, కెనడా డాలర్లు 5, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి..

వీడియో చూడండి..

పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
డబ్‌స్మాష్ ద్వారా పాపులర్.. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్..
డబ్‌స్మాష్ ద్వారా పాపులర్.. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్..