Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా శ్రీ,భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణం..హాజరైన చిన్నజీయర్, మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత..

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్‎లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 26వ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువుగా సాగింది.

వైభవంగా శ్రీ,భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణం..హాజరైన చిన్నజీయర్, మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత..
My Homes Industrys
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Apr 01, 2024 | 4:25 PM

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్‎లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 26వ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువుగా సాగింది. స్వామి అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామి వారి తిరు కళ్యాణం జరిగింది. అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కళ్యాణ తంతు నిర్వహించారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు సాగింది.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవి మెడలో మంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ తిరువీధుల ప్రాంగణం “నమో వెంకటేశాయ, గోవిందా” అనే నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశులయ్యారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని ఆహోబిలం పీఠాధిపతి రామానుజాచార్య చెప్పారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతును గురించి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి భక్తులకు ప్రవచనామృతాన్ని అందించారు. లోక కళ్యాణార్థం, జగత్ రక్షణ కోసం జరిగిన ఈ కళ్యాణానికి ముందు గజవాహన సేవపై ఉత్సవ మూర్తులను ఆలయ తిరువీధుల్లో ఉరేగించారు. స్వామి వారి తిరు కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు, కుమారి దంపతులు అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..