బ్యాంకాక్‌ నుంచి పార్శిల్ వచ్చిందన్నారు.. కట్ చేస్తే.. ఒక్క ఫోన్ కాల్‌తో సీన్ సితారయ్యింది!

బ్యాంకాక్‌ నుంచి పార్శిల్ వచ్చిందని ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. తీరా మొత్తం విషయాన్ని తెలుసుకున్న తర్వాత.. సదరు వ్యక్తి.. అటువైపు వారితో సంభాషించాడు. కట్ చేస్తే.. ఒక్క ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత.. ఆ బాధిత వ్యక్తి సీన్ కాస్తా రివర్సయింది. ఇంతకీ అసలేం జరిగింది.. ఆ స్టోరీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్యాంకాక్‌ నుంచి పార్శిల్ వచ్చిందన్నారు.. కట్ చేస్తే.. ఒక్క ఫోన్ కాల్‌తో సీన్ సితారయ్యింది!
Representative Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2024 | 12:06 PM

నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. కొత్త తరహా పంథాలో అమాయకులను వలలో వేసుకుని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో, మీకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని కేసు బుక్ అయిందంటూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులను దండుకుంటున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్‌తో తొమ్మిది లక్షల 69 వేల రూపాయలను పోగొట్టుకున్నాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

ఇటీవల కాలంలో ఓ వ్యక్తిని ఒక రూమ్‌లో బంధించి తనను ఎక్కడికి వెళ్ళనీయకుండా తాను ఒకవేళ వెళ్తే తన కుటుంబ సభ్యులకు కూడా హాని కలుగుతుందని బెదిరించి ఏకంగా 30 లక్షల రూపాయలను దోచుకున్న ఘటన మరవకముందే మరో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి బ్యాంకాక్ నుంచి పార్శిల్ వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై ముంబై కస్టమ్స్ అధికారులు ఈ అంశంపై కేసు నమోదు చేశారని.. సోదాలు చేసి మొత్తం కుటుంబాన్ని అరెస్టు చేస్తారని బెదిరించాడు. ఈ కేసు నుంచి తప్పించాలంటే పైసలు పంపించాలని కోరారు సైబర్ నేరస్తులు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు 9.69 లక్షల రూపాయలను బదిలీ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సాగర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ విధంగా పార్శిల్స్ పేరిట ఫోన్లు వచ్చినా.. భయాందోళనకు గురికాకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితుల నుంచి కాల్స్ వచ్చిన తర్వాత డబ్బులు అడిగితే వేయకూడదని.. అంతేకాకుండా కేసులు బుక్కు చేశారని చెప్పినా.. భయపడద్దని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో తరచూ ఈ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్

మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!

అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!

అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు

గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి