Hyderabad: తెల్లారగానే కిరాణా షాపునకు విద్యార్ధులు క్యూకట్టారు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా.!
అది గచ్చిబౌలి ఏరియా. హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ది బిజియస్ట్ స్పాట్. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయేదాకా.. విద్యార్ధులు, కూలీలు, ఐటీ ఎంప్లాయిస్.. ఇలా ఒకరేమిటి అందరూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఇక స్థానిక నానక్‌రామ్ గూడలో బ్రతుకుతెరువుకు 39 ఏళ్ల అనురాధ బాయి అనే మహిళ చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది.
అది గచ్చిబౌలి ఏరియా. హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ది బిజియస్ట్ స్పాట్. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయేదాకా.. విద్యార్ధులు, కూలీలు, ఐటీ ఎంప్లాయిస్.. ఇలా ఒకరేమిటి అందరూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఇక స్థానిక నానక్‌రామ్ గూడలో బ్రతుకుతెరువుకు 39 ఏళ్ల అనురాధ బాయి అనే మహిళ చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. వచ్చే అరకొర డబ్బుతో జీవనం సాగిస్తోంది. అంతా బాగానే ఉన్న తరుణంలో ఏమైందో ఏమో గానీ.. ఆమెకు అత్యాస పెరిగింది.. తప్పుదారి పట్టింది. అంతే.. ఒక్కసారిగా ఆ షాపులో గంజాయి గుప్పుమంది.
వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నా అనురాధ బాయి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ SOT పోలీసులు. స్థానికంగా ఓ కిరాణా దుకాణం నడుపుతున్న అనురాధ.. దూల్‌పేట నుంచి గంజాయిని సేకరించి.. దాన్ని చిన్న ప్యాకెట్లుగా చుట్టి విద్యార్ధులు, కూలీలకు విక్రయిస్తున్న పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతోనే SOT పోలీసులు రైడ్ చేసి.. నిందితురాలి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, 1200 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.