రేపటి నుంచి అనంత పద్మనాభస్వామి దర్శనానికి అనుమతి..నయా రూల్స్!

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఆలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు రేపటి నుంచి

రేపటి నుంచి అనంత పద్మనాభస్వామి దర్శనానికి అనుమతి..నయా రూల్స్!
Jyothi Gadda

|

Aug 25, 2020 | 6:15 PM

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఆలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు రేపటి (ఆగస్ట్ 26, బుధవారం) నుంచి భక్తులకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి11 గంటల వరకూ నాలుగు గంటలపాటు.. మళ్లీ తిరిగి సాయంత్రం 5 నుంచి సాయంత్రం దీపారాధన సమయం వరకూ పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. రేపటి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్న నేపథ్యంలో… ఆలయం లోపలికి ఒక్కసారికి 35 మందిని అనుమతిస్తామని, ఒక్కరోజుకు 665 మంది భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, దర్శనానికి వచ్చే సమయంలో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ కాపీతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని పద్మనాభస్వామి ఆలయ బోర్డు తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu