ఈ నెల 30నుంచి రొట్టెల పండుగ…కోవిడ్ నిబంధనలు తప్పనిసరి!

నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పడితే ఇక కోరిక తీరినట్లే అనేది భక్తుల నమ్మకం..అయితే, ఇప్పుడు నెల్లూరు రొట్టెల పండుగపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది.

ఈ నెల 30నుంచి రొట్టెల పండుగ...కోవిడ్ నిబంధనలు తప్పనిసరి!
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2020 | 3:09 PM

నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పడితే ఇక కోరిక తీరినట్లే అనేది భక్తుల నమ్మకం. కులం, మతం, ప్రాంతం, పేద, గొప్ప అనే తేడా లేకుండా దేశ నలుమూలల నుంచి ఇక్కడకు ప్రజలు తరలి వస్తుంటారు. గత కొన్నేళ్లుగా లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులను చూస్తేనే నమ్మకం ఏస్థాయిలో వుందో అర్థమవుతుంది. లక్షలమంది బారాషహీద్‌ సాక్షిగా రొట్టెల పండుగ జరుగుతుంది. అయితే, ఇప్పుడు నెల్లూరు రొట్టెల పండుగపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది.

కరోనా వైరస్..ఈ మహమ్మారి ప్రతాపం కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు రొట్టెల పండుగ పై కూడా వైరస్ ప్రభావం పడింది. మొహరం పండుగ అయినా మూడోరోజు నెల్లూరు స్వర్ణాల చెరువులో భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారి కోరికల రొట్టెలను భక్తులు మార్చుకుంటారు. కోరుకున్న కోర్కెలు నెరవేరిన వారు.. రొట్టెలు వదులుతుంటే.. కొత్త కోర్కెలతో ఆ రొట్టెలను పట్టుకుంటారు అవతలివారు. ఈ నమ్మకం ఏడాదికేడాదికి ప్రబలం కావడంతో తొలినాళ్లలో ఒక్కరోజు జరిగిన ఈ పండగ ప్రస్తుతం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.

వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ రొట్టెల పండుగపై ఈ ఏడాది(2020) నిషేధం విధించారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన దేశ నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న రొట్టెల పండుగ కు భక్తులరాకను, రొట్టెలు మార్చుకోవడం నిషేధించారు.. దర్గాలో ఈ నెల 30వ తేది నుంచి సెప్టెంబ‌ర్ 3వ తేది వ‌ర‌కూ ఐదు రోజులపాటు 20 మందితో గంధమహోత్సవం నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం.

ఈ పండుగలో పాల్గొనేందుకు జిల్లా ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాలు, తవిుళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలతో పాటు విదేశాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా పాల్గొంటున్నారు. రొట్టెల పండుగ విశిష్ఠత పెరగడంతో దీనికి రాష్ట్ర పండుగ హోదా కూడా లభించింది.